end
=
Friday, December 5, 2025
వార్తలుఅంతర్జాతీయంమేం తటస్థం కాదు.. శాంతి పక్షం.. దౌత్య మార్గాలకే మా మద్దతు : పుతిన్‌కు మోదీ...
- Advertisment -

మేం తటస్థం కాదు.. శాంతి పక్షం.. దౌత్య మార్గాలకే మా మద్దతు : పుతిన్‌కు మోదీ స్పష్టీకరణ

- Advertisment -
- Advertisment -

Putin India Visit: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఘర్షణకు శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా రష్యా(Russia) కట్టుబడి ఉందని, దీనికి సంబంధించి తాము సిద్ధం చేసిన ప్రతిపాదనలను భారత్‌ (India)తో ఇప్పటికే పంచుకున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(President Vladimir Putin) తెలిపారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)తో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేసి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న విశ్వాసం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ ముఖ్య సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, ఇంధన భద్రత, రక్షణ సహకారం, వాణిజ్య సంబంధాలు వంటి అంశాలు ప్రధాన చర్చాంశాలయ్యాయి.

సైనిక ఘర్షణ ఏ సమస్యకూ పరిష్కారం కాదని, శాంతి చర్చల ద్వారానే సంక్షోభానికి శాశ్వత పరిష్కారం సాధ్యమని భారత్ అభిప్రాయపడుతున్నట్లు ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరిగిన ఈ పరిస్థితుల్లో రాజనీతిక మార్గాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న భారత వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌కు చేరుకున్న పుతిన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. పుతిన్ తన ప్రత్యేక రక్షణా వాహనం ‘ఆరస్ సెనెట్’ ఉపయోగించకుండా, ప్రధాని మోదీ వ్యక్తిగత కారులో ప్రయాణించడాన్ని విశ్లేషకులు ఇరువురు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధానికి ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ చర్య రష్యా–భారత్ మైత్రి స్వభావాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తు చేసిందని వారు అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో పుతిన్‌ భారత్‌ పర్యటనపై పశ్చిమ దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.

ముఖ్యంగా చమురు దిగుమతుల విషయంలో భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా వంటి దేశాలకు పుతిన్ ఘాటుగా ప్రతిస్పందించారు. వారు మా దేశం నుంచి అణుఇంధనం, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అయితే భారత్‌ ఎందుకు కొనకూడదు? అని ప్రశ్నిస్తూ, ఇంధన వాణిజ్యంలో ద్వంద్వ ప్రమాణాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు రక్షణ రంగ సహకారం బలోపేతం, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, వాణిజ్య భద్రత, అలాగే పాశ్చాత్య ఆంక్షల ప్రభావం నుంచి ద్వైపాక్షిక లావాదేవీలను రక్షించే విధానాలపై ప్రత్యేక చర్చలు జరిపినట్లు సమాచారం. రష్యా–భారత్ సంబంధాలు ప్రపంచ రాజకీయ సమీకరణాల్లో కీలక స్థానాన్ని సాధించాయని, ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాల దిశగా తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని రెండు ప్రభుత్వాలు సంకేతాలు పంపాయి. ఈ సమావేశం ద్వారా, ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో కూడా భారత్‌ మరియు రష్యాల మధ్య నమ్మకం, వ్యూహాత్మక అనుబంధం కొనసాగుతోందనే విషయాన్ని మరోసారి ఢిల్లీ ప్రపంచానికి తెలియజేసింది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -