end
=
Saturday, June 14, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంHypoglycemia: హైపోగ్లైసీమియా అంటే ఏమిటి ? ఎలా నిర్వహించాలి ?
- Advertisment -

Hypoglycemia: హైపోగ్లైసీమియా అంటే ఏమిటి ? ఎలా నిర్వహించాలి ?

- Advertisment -
- Advertisment -

Hypoglycemia: మన శరీరానికి శక్తి ఇచ్చే ప్రధాన మూలం గ్లూకోజ్(Glucose) (చక్కెర). శరీరంలోని గ్లూకోజ్ స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు అది హైపోగ్లైసీమియా(Hypoglycemia) అనే పరిస్థితిని ఏర్పరుస్తుంది. ఇది ముఖ్యంగా డయాబెటిస్ (Diabetes Patients)ఉన్నవారిలో తరచూ కనిపించే సమస్య. కానీ, కొన్నిసార్లు ఇతర కారణాల వలన కూడా ఇది సంభవించవచ్చు.

హైపోగ్లైసీమియా(Hypoglycemia) – ముఖ్యమైన లక్షణాలు
  • ఆకలి(Hungry) ఎక్కువగా వేయడం
  • గుండె వేగంగా కొట్టడం
  • కంపించడం (shivering)
  • చెమటలు(swets) పట్టడం
  • చల్లగా ఉండటం
  • గుండె బీట్స్(Heart Beat) అసాధారణంగా ఉండటం
  • మూర్చ లేదా స్పృహ (Unconsious)కోల్పోవడం

హైపోగ్లైసీమియాకు కారణాలు
  • ఎక్కువగా ఇన్సులిన్ (Insulin)తీసుకోవడం
  • భోజనం(Lunch) వాయిదా వేయడం లేదా మానేయడం
  • ఎక్కువ శారీరక శ్రమ (వ్యాయామం)(over Exercise)
  • ఆల్కహాల్(Alcahol) సేవించడం
  • కొన్ని ఔషధాలు (non-diabetic మందులు కూడా)
హైపోగ్లైసీమియా(Hypoglycemia) సమయంలో తక్షణ చర్యలు

1. తక్షణంగా చక్కెర(Sugar) తీసుకోండి

  • 3 నుండి 4 గ్లూకోజ్(Glucose) టాబ్లెట్లు లేదా
  • 1 గ్లాస్ ఫ్రూట్ జ్యూస్(Fruit Juice)
  • 1 టేబుల్ స్పూన్ తేనె(Honey) లేదా చక్కెర
  • మిఠాయి లేదా క్యాండీలు (జెల్లీ, హార్డ్ క్యాండీ)

2. 15 నిమిషాల తర్వాత గ్లూకోజ్ స్థాయిని చెక్ చేయండి

  • ఇంకా తక్కువగానే ఉంటే, మళ్లీ చక్కెర తీసుకోండి
  • మెరుగవుతున్నట్లైతే, తినడానికి స్వల్ప భోజనం చేయండి (స్నాక్)

3. స్పృహ(Unconsious) కోల్పోతే

  • వెంటనే వైద్య (Medication)సహాయం తీసుకోవాలి
  • గ్లూకాగాన్ ఇంజెక్షన్ ఉంటే ఉపయోగించాలి
హైపోగ్లైసీమియా నివారణ మార్గాలు
  • సరైన భోజన సమయాలు పాటించండి
  • ఇన్సులిన్ డోస్‌ను నియమంగా తీసుకోండి
  • వ్యాయామం చేసే ముందు తినడం మర్చిపోకండి
  • అత్యవసర చక్కెర పదార్థాలు ఎప్పుడూ దగ్గర ఉంచుకోండి
  • బ్లడ్ షుగర్‌(Blood Sugar)ను క్రమం తప్పకుండా చెక్ చేయండి
  • మద్యం సేవించండి ఆపేయడం

హైపోగ్లైసీమియా తక్కువగా కనిపించే సమస్యగా అనిపించినా, అది సరైన సమయంలో గుర్తించి చర్య తీసుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ప్రత్యేకంగా డయాబెటిస్ ఉన్నవారు ఈ పరిస్థితిని తప్పక గమనించాలి. సరైన సమాచారం, సమయానికి తీసుకునే చర్యలు, వైద్యుల సలహాలతో హైపోగ్లైసీమియాను సమర్థంగా నియంత్రించవచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -