end
=
Tuesday, July 1, 2025
రాజకీయంబీజేపీ తెలంగాణ పగ్గాలు ఎవరికి చిక్కేనో ?
- Advertisment -

బీజేపీ తెలంగాణ పగ్గాలు ఎవరికి చిక్కేనో ?

- Advertisment -
- Advertisment -

పార్టీ అధ్యక్ష పదవికి రేపు నోటిఫికేషన్
జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన​
రేసులో ఎంపీలు ఈటల, డీకే అరుణ, రఘునందన్​రావు, అర్వింద్​

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha party) శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి (State president Elections) ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అధిష్ఠానం జూలై 1న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నది. దీనిలో భాగంగానే ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల(Notification will release) చేయనున్నది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ (Nominations starts soon) ప్రారంభం కానున్నది. జూలై 1న ఎన్నికలు జరుగుతాయి. ఇదే రోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారు. 

పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (MP Laxman) వ్యవహరించనున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు అనేకమంది నేతలు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారు. పార్టీ పరంగా అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఎంపీ బండి సంజయ్‌కుమార్​ ఇప్పటికే కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ,

అధిష్ఠానం మరోసారి ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీలు ఉన్న నేతలంతా బయటకు తాము రేసులో లేమని చెబుతున్నా.. లోలోపల పదవీ కోసం తీవ్రంగా లాబీయింగ్‌లు చేస్తు్న్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తోందనని బీజేపీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణ నెలకొంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితం..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను బీజేపీ ఎనిమిది స్థానాలను కైవలం చేసుకున్నది. ఎమ్మెల్యేలుగా సిర్పూర్​ అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్​ పాల్వయ్​ హరీశ్​, ఆదిలాబాద్​ నుంచి పాయల్​ శంకర్​, నిర్మల్​ నుంచి ఏలేటి మహేశ్వర్​రెడ్డి, ఆర్మూర్​ పైడి రాకేశ్​రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నిజమాబాద్ అర్బన్​ నుంచి ధన్​పాల్​ సూర్యనారాయణ, గోషామహల్​ నుంచి టీ రాజాసింగ్​ గెలిచారు.

లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లతో సత్తా..
2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు సాధించి దుమ్మురేపింది. ఆదిలాబాద్​ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గోడం నగేశ్​, కరీంనగర్​ నుంచి బండి సంజయ్​కుమార్​, నిజామాబాద్​ నుంచి ధర్మపురి అర్వింద్​, మెదక్​ నుంచి రఘునందన్​రావు, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​, సికింద్రాబాద్​ నుంచి జీ కిషన్​రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్​రెడ్డి విజయబావుటా ఎగురవేశారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది.

ఇదే స్ఫూర్తితో స్థానిక ఎన్నికలకు..
రాబోయే స్థానిక ఎన్నికల సమరానికి బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఇప్పటికే అధిష్ఠానం బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల నియామకాలు కూడా చేపట్టింది. వరుసగా వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -