end
=
Wednesday, August 6, 2025
సినీమా‘ఓలే ఓలే’ పాట కాంట్రవర్సీ ఎందుకు?
- Advertisment -

‘ఓలే ఓలే’ పాట కాంట్రవర్సీ ఎందుకు?

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్​ స్టార్​ (Tollywood Star) రవితేజ (Raviteja) కథానాయకుడిగా నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం(Mass Jathara Movie) నుంచి విడుదలైన రెండవ పాట ‘ఓలే ఓలే’ (Ole Ole song) ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నది. పాట వివాదం (Controversy)పై మీరేం అనుకుంటున్నారు? లేదా ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. వార్త చదవాల్సిందే.

పాటలో మహిళలను అగౌరవపరిచే (disrespect women) పదాలు (Some Words) ఉన్నాయంటూ ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాట సాకీలో అభ్యంతరకరంగా పదాలు వాడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘సికాకుళం జిల్లా మొత్తం యెతికి తిరిగి పట్టుకున్న.. యాడనుంచి వచ్చావే సిలకా గిలాకా మొలకా పలకా.. రాయలేక రాసుకున్న రాతలన్ని మారిపోయెనే.. లిమిట్‌ను టచ్చేసిన పిల్లా.. లిమిటెడ్‌గా వచ్చేసిందే లవ్వూ..

ప్రేమ.. కోపం.. మోసం..’ అంటూ ప్రారంభమైన ఈ పాట స్త్రీలను అగౌరవపరిచేవిధంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా, రవితేజ సరసన శ్రీలీల నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తూ, రోహిణి సోరట్‌తో కలిసి ఆలపించారు. ఈ పాటకు దాసరి భాస్కర్ యాదవ్ సాహిత్యం అందించారు. సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వివాదంపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -