- వికారాబాద్ జిల్లా షాపూర్ తండాలో విషాధం
రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ కుటుంబ సభ్యులు వాగుదాటుతుండగా ప్రమాదవశాత్తు మహిళ వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఈ దురదృష్టకర ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం షాపూర్‌తండాలో జరిగింది. ఘటనా వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన దశరథ్, అనితాబాయి పత్తి పంటలో కలుపు తీయటానికి వెళ్లారు. వీరితో పాటు కుమార్తెలు వీణాబాయి, బబ్లూబాయి, ఇద్దరు కుమారులు వెళ్లారు.
సినీ నటుడు నాగబాబుకు కరోనా పాజిటివ్
పొలం పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి భారీగా వర్షం కురుస్తోంది. తండాకు దగ్గరగా ఉన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో వారు వర్షం తగ్గే వరకు కొంతసేపు వేచి చూశారు. కానీ దశరథ్ భార్య అనితబాయి ఇంటి దగ్గర పనులు ఉన్నాయి త్వరగా వెళదామని తొందరపెట్టడంతో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు వాగు దాటడానికి ప్రయత్నించారు. కుమారులు దండ్రి దశరథ్‌ను పట్టుకోగా, కుమార్తెలు తల్లి అనితాబాయిని పట్టుకొని వాగు దాటసాగారు.
అక్టోబర్ 5 నుంచి అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పరీక్షలు
ఈ క్రమంలో కుమార్తెలు చేయి జారిపోయి వాగులో కొట్టుకొనిపోయారు. ఈ కంగారులో తల్లి అనితాబాయి వారిని రక్షించబోయి పిల్లలతోపాటు వాగులో పడిపోయింది. ఇది గమనించిన దశరథ్ కుమార్తెలు వీణాబాయి, బబ్లూబాయిలను రక్షించి ఓడ్డుకు చేర్చాడు. కానీ అప్పటికే అనితాబాయి చాలా దూరంలో వాగులో కొట్టుకుపోయింది.
టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు మృతి
స్థానికుల సహాయంతో వాగులో వెతికారు. చివరకు కనిపెట్టి ఒడ్డుకు చేర్చారు. కానీ దురదృష్టావశాత్తు అనితాబాయి అప్పటికే మరణించింది. అనితాబాయి చూస్తుండగానే మరణించడంతో భర్త దశరథ్, పిల్లలు రోధనలు అందరిని బాధిస్తుంది. ఈ ప్రమాద సంఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మర్పల్లి ఎస్‌ఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.