- సురక్షితంగా బయటపడిన కలెక్టర్ అనితా రామచంద్రన్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వాహనానికి పెద్ద ప్రమాదం జరిగింది. అయితే అదృష్టావశాత్తు కలెక్టర్ అనితారామచంద్రన్ క్షేమంగా బయటపడ్డారు. భువనగిరి సమీపంలో కలెక్టర్ కారును లారీ ఢీ కొట్టింది. అకాల వర్షంతో వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో పంటపొలాలను పరిశీలించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.