end
=
Monday, April 29, 2024
విద్యా సమాచారంScholarship:నర్సింగ్ విద్యార్థులకు 50వేల స్కాలర్షిప్
- Advertisment -

Scholarship:నర్సింగ్ విద్యార్థులకు 50వేల స్కాలర్షిప్

- Advertisment -
- Advertisment -
  • ఆర్థికసాయం అందిస్తున్న ఫిలిప్స్ సంస్థ

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన వైద్య విద్య చదువుతున్న విద్యార్థులకు ఫిలిప్స్ సంస్థ (Phillips Scholarship) స్కాలర్షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్షిప్ కింద, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బిఫార్మసీ, బిఎఎంఎస్, బీహెచ్ఎంఎస్ (MBBS, BDS, Nursing, BPharmacy, BAMS, BHMS) లేదా ఏదైనా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వారి విద్యాఖర్చులకు రూ. 50,000 స్కాలర్షిప్ మొత్తాన్ని ఫిలిప్స్ సంస్థ అందిస్తుంది.

అర్హత:
విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బిఫార్మసీ, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ లేదా ఏదైనా వైద్యవిద్యా కోర్సులు చదువుతున్న వారు అర్హులు. దరఖాస్తు దారులు 12వ తరగతిలో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించరాదు. భారతీయ విద్యార్థులై ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం:
ఎంపికైన వారికి రూ. 50,000 స్కాలర్షిప్‌గా అందిస్తారు.

కావలసిన డాక్యుమెంట్స్:
ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్ (ఆధార్/ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డ్) (Aadhaar/Voter ID/Driving License/PAN Card) ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్ (రిసిప్ట్/అడ్మిషన్ లెట్టర్/ఐ.డీ/బోనఫైడ్) 12వ తరగతి మార్క్స్ షీట్. కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఫార్మ్ 16ఎ/ఇన్ కమ్ సర్టిఫికెట్/శాలరీ స్లిప్) దరఖాస్తు దారుని బ్యాంకు డిటెయిల్స్ (క్యాన్సెల్డ్ చెక్/పాస్ బుక్ కాపీ) (Copy of canceled cheque/pass book) ఎ పాస్ పోర్ట్ సైజ్డ్ ఫోటోగ్రాఫ్

చివరితేది: జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://www.buddy4study.com

(Scholarship:విద్యార్థులకు ONGC స్కాలర్‌షిప్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -