end
=
Monday, April 29, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Horoscope:ఆ రాశులవారు శివారాధన చేస్తే కోరికలు నెరవేరుతాయి!
- Advertisment -

Horoscope:ఆ రాశులవారు శివారాధన చేస్తే కోరికలు నెరవేరుతాయి!

- Advertisment -
- Advertisment -

  • నేటి రాశి ఫలాలు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: మాఘము వారం: సోమవారం, తిథి: శు. విదియ నక్షత్రం: ధనిష్ఠ
ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ జనవరి 23, 2022కు సంబంధించి అందించిన రాశి ఫలాలు.

మేష రాశి :
మేష రాశి వారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంది. వ్యయ స్థానము నందు చంద్రుని ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. పనులు ఒత్తిడి అధికముగా ఉండును. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మేషరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

వృషభ రాశి :
ఈ రోజు మీకు అనుకూలముగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు లింగాష్టకాన్ని పఠించడం మంచిది.

మిథున రాశి :
ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ ఏర్పడును. పిల్లల వలన చికాకులు ఏర్పడును. మీ కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందెదరు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణమునందు ఖర్చులు అధికమగు సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మిథున రాశి వారు రుద్రాభిషేకము, శివారాధన చేయటం వలన ఈ రోజు మంచిది.

కర్కాటక రాశి :
ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. శారీరక సౌఖ్యమును పొందెదరు. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము, శివాభిషేకం చేసుకోవడం వలన శుభ ఫలితము కలుగును.

సింహ రాశి :
ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అష్టమ చంద్రుని ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు పెరుగును ఆరోగ్య విషయమందు జాగ్రత్త వహించాలి. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉన్నది. సింహరాశి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు శివాలయంలో శివునికి అభిషేకము చేసుకోవడం మంచిది.

కన్య రాశి :
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. ధనలాభము కలుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కీర్తి కలుగును. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్య రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం చంద్రశేఖరాష్టకము, లింగాష్టకం పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

తులా రాశి :
ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ అధికమగును. పనుల యందు ఆటంకములు ఏర్పడును. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. కుటుంబ సౌఖ్యము కలుగును. సంతానము వలన సంతోషము కలుగును. అప్పుల ఒత్తిడి ఉండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి :
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. చంద్రుని అనుకూల ప్రభావం చేత సౌఖ్యము కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఉద్యోగములో ఒత్తిళ్ళు వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సోదరులు, పిల్లల వలన చికాకులు కలుగును. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. వృశ్చిక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లింగాష్టకము, బిల్వాష్టకము చదువుకోవడం వలన మరింత శుభ ఫలితాలు పొందెదరు.

ధనుస్సు రాశి :
ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితముగా ఉన్నది. మీరు చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధు వియోగం ఏర్పడు సూచన. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.

(Scholarship:నర్సింగ్ విద్యార్థులకు 50వేల స్కాలర్షిప్)

మకర రాశి :
ఈ రోజు మీకు మధ్యస్తమునుండి అనుకూల ఫలితాలు ఉన్నవి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు అధికముగా ఉండును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు శివాలయంలో శివుని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం శివాష్టకము, లింగాష్టకము పఠించడం వలన ఆరోగ్యస్థితి కలుగును.

కుంభ రాశి :
ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. చంద్రుని అనుకూల ప్రభావం చేత ఆనందముగా గడిపెదరు. ఏలినాటి శని ప్రభావము ఉన్నప్పటికి ఈరోజు అనుకున్న పనులు పూర్తి చేసెదరు. ఏలినాటి శని ప్రభావంచేత శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు కొంత ఒత్తిళ్ళు ఏర్పడును. ఈరోజు సుఖభోజన ప్రాప్తి, సౌఖ్యము కలుగును. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో విభూతితో శివునికి అభిషేకం చేసుకోవడం, అలాగే శివపంచాక్షరీ మంత్రంలో జపం చేయడం వలన వలన శుభ ఫలితములు కలుగును.

మీన రాశి :
ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శారీరక శ్రమ అధికముగా ఉండును. ఆందోళన కలుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -