- కన్నీటీ పర్యంతమైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి
జగిత్యాల జిల్లా మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి (Municipal Chairman Boga Shravani) తన పదవికి రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక ఎమ్మెల్యేపై (MLA)తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాల (Jagityal) బీఆర్ఎస్ (BRS)లో విభేదాలు రచ్చకెక్కాయి. ఏకంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా చేసే వరకు వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ కంటతపడి పెట్టారు.
ఈ మేరకు జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో (Press meet) శ్రావణి మాట్లాడారు. ‘పిల్లలు ఉన్నారు. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త’ అంటూ ఎమ్మెల్యే సంజయ్ (Sanjay) బెదిరిస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం డిమాండ్ చేశారని అన్నారు. దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక తనపై కక్షగట్టారని కామెంట్స్ చేశారు. అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయొద్దని హుకుం జారీ చేశారని వాపోయారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి నరకప్రాయంగా ఉందన్న శ్రావణి ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్ ఛైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది.
(Telangana Government:ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు)
ఈ మేరకు పేరుకే మున్సిపల్ ఛైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదే అన్నారు. తనకు అనుకూలంగా ఉన్న కొంతమంది కౌన్సిలర్లను కూడా ఇబ్బంది పెట్టారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆశీర్వదిస్తూ కవిత (Kavitha)ఇంటికి వస్తే వేధింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి (Former Khammam MP Ponguleti)రేపోమాపో ఏదో ఒక పార్టీలోకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య (ZP Chairman Koram Kanakaiah) కూడా బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లనున్నారు. ఈ క్రమంలో జగిత్యాల బీఆర్ఎస్ లో మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే సంజయ్‌తో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకున్నారు. ఎన్నికల ఏడాది వేళ పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్నారు.