end
=
Sunday, May 4, 2025
రాజకీయంఎన్ని గ్రామాల్లో పర్యటించారు..? ఎమ్మెల్యేలకు సీఎం ప్రశ్నలు
- Advertisment -

ఎన్ని గ్రామాల్లో పర్యటించారు..? ఎమ్మెల్యేలకు సీఎం ప్రశ్నలు

- Advertisment -
- Advertisment -

పార్టీ బలోపేతానికి ఏం చేస్తున్నారు?
ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా ముప్పావుగంట భేటీ

తెలంగాణ(Telangana state)లో కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడివక్కడే అసంపూర్తిగా ఉన్నాయి. ఇవి కాక ప్రభుత్వం స్వయంగా కొన్ని మెగా అభివృద్ధి పనులు ఎత్తుకున్నది. ఇలాంటి సందర్భంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే ఉత్సాహంతో సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth reddy) కొత్త ప్రణాళికల(New drives)కు శ్రీకారం చుట్టారు. తమ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో స్వయంగా భేటీ కావాలని నిర్ణయించారు.

ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడి తెలుసుకుంటున్నారు. కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి పనులపై కూడా ఆరా తీస్తున్నారు. దీనిలో భాగంగానే గురువారం హైదరాబాద్​లోని కమాండ్​ కంట్రోల్​ రూంలో మహబూబ్​నగర్​ పార్లమెంటరీ సెగ్మెంట్​కు చెందిన ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణిక, అనిరుధ్​రెడ్డి, మధుసూదన్​రెడ్డి, శ్రీహరి, శంకరయ్యతో విడివిడిగా మాట్లాడారు. ఒక్కొక్కరితో సుమారు గంట పాటు మాట్లాడారు.

సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్​ కూడా ఈ పార్లమెంటరీ సెగ్మెంట్​లోనే ఉంది. కొడంగల్​ నియోజకవర్గ అభివృద్ధిపైనా సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది.

అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారం..

సీఎం రేవంత్​రెడ్డి ఎమ్మెల్యేలతో భేటీ అయి ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. సమావేశం తర్వాత సీఎంవో కార్యాలయం అధికారులతో ఒక్కో ఎమ్మెల్యే సమావేశమవుతున్నారు. తమ నియోజకవర్గ సమస్యలపై విపులంగా చర్చిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు నియోజకవర్గాల్లో ఏ మేరకు నెరవేరుతున్నాయి.. నియోజకవర్గంలో మున్ముందు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైనా సీఎం ఆరా తీస్తున్నారు. సీఎంవో కార్యాలయంలో సంబంధిత జిల్లాను చూసే అధికారి కూడా సమావేశంలో పాల్గొంటున్నారు.

పనితీరుపైనా సమీక్ష..

అభివృద్ధి పనుల గురించి చర్చించిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ప్రత్యేకంగా సమీక్షిస్తున్నట్లు తెలిసింది. గడప దాట కుండా, ప్రజాసమస్యలను పట్టించుకోకుండా ఉంటున్న ఎమ్మెల్యేలను సీఎం తీవ్రంగానే మందలించనున్నట్లు తెలిసింది. తమ పనితీరు మెరుగుపరచుకోకపోతే పార్టీ చూస్తు ఊరుకోదని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఉదాహరణకు ఒక ఎమ్మెల్యేను ఇలాంటి ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. గడిచిన 17 నెలల్లో మీ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాల్లో పర్యటించారు? రానున్న మూడేండ్ల కాలంలో తమ నియోజకవర్గానికి ఏం కావాలి ?

ఎన్ని పాదయాత్రలు చేపట్టారు..? ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఏ మేరకు చేరువ చేస్తున్నారు..? నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు..? అనే అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలిసింది. అంతేకాదు.. వారి సమాధానాలను పేపర్​పై రాయించి మరి రికార్డు చేస్తున్నట్లు తెలిసింది. రెండు నెలల్లో 64 మంది ఎమ్మెల్యేలతో భేటీ కార్యక్రమం పూర్తి చేస్తారని సమాచారం.

అసంతృప్తులకు చెక్​..

‘సీఎం మాకు అందుబాటులోకి రావడం లేదు.. కనీసం సీఎం అపాయింట్​మెంట్​ కూడా దొరకడం లేదు.. ఇక మా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు ఎలా పరిష్కారం చూపాలి? అభివృద్ధి పనులకు నిధులు ఎలా రాబట్టుకోవాలి’ అని కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొద్దిరోజులుగా సీఎం రేవంత్​రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు. వీరిలో కొందరు చాటుగా, మరికొందరు తమ అనుయాయులతో ఈ మాటలు అన్నట్లు సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఇవన్నీ ఈనోటా ఆ నోటా సీఎం వరకు చేరాయి.

దీంతో సీఎం ఇలా మంచి పరిష్కార మార్గం ఆలోచించినట్లు తెలిసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -