గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు
తమిళ భాష (Tamil Lagnuage) నుంచే కన్నడ పుట్టిందనే అర్థం వచ్చేలా బెంగళూరులో జరిగిన మూవీ ప్రమోషన్(Movie promotion)లో విలక్షణ నటుడు కమల్‌హాసన్(Versatile Actor Kamal Hasan) చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. వ్యాఖ్యల కారణంగా కర్ణాటక ప్రభుత్వం ఆయన నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’(Thug life movie)ను ఆ రాష్ట్రంలో బ్యాన్ చేసింది. చిత్రం విడుదల కోసం చిత్ర బృందం హైకోర్టును ఆశ్రయించగా, సుప్రీం కోర్టు పిటిషన్‌ను తనకు బదిలీ చేసుకున్నది.
మంగళవారం పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం వెంటనే చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేసుకోవచ్చని పేర్కొన్నది. అలాగే కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని కర్ణాటక హైకోర్టు కోరడాన్ని తప్పబట్టింది. ఎవరైనా వ్యక్తి ఒక వ్యాఖ్య చేసినప్పుడు, దానిని ఖండించే హక్కు వ్యక్తులకు ఉంటుందే కానీ, సినిమా విడుదలతో వారికి ఎలాంటి నిమిత్తం ఉండబోదని స్పష్టం చేసింది.
సినిమా విడుదల చేస్తే థియేట్లరను తగులబెడతామని బెదిరించే తరహా వ్యాఖ్యలు చేసే అధికారం సంఘాలకు ఉండదని తేల్చిచెప్పింది. కర్ణాటక ప్రజలకు కమల్‌హాసన్ వ్యాఖ్యలతో విభేదించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందని చెప్తూనే, ఎవరైనా ప్రాథమిక హక్కులనూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది.
ఒకసారి ఒక సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ విడుదలైన తర్వాత, ఇక చిత్రాన్ని నిలుపు చేసే అధికారం ఎవరికీ ఉండదని తేల్చిచెప్పింది. అయితే.. ఆ చిత్రాన్ని చూడాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారని అభిప్రాయపడింది.