సీబీఎస్ఈ సిలబస్‌కు ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board Of Secondary Education) పదో తరగతి విద్యార్థుల (Tenth Class Students) కు షాక్ ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు (Two Times Exams for Anum)నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు ఇక యేటా ఫిబ్రవరిలో తొలి విడత, మే నెలలో రెండో విడత పరీక్షలు జరుగనున్నాయి.
మొదటి విడత పరీక్షల (First Session Exams)ను తప్పనిసరి చేయగా, మే నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షలు ఆప్షనల్ అని తెలుస్తున్నది. మొదటి విడత ఫలితాలు ఏప్రిల్, రెండో విడత ఫలితాలు జూన్‌లో విడుదలవుతాయి. సంవత్సరమంతా చదివి చివరలో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని గుర్తించిన సీబీఎస్ఈ ఈవిధమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రెండు విడతల్లో నిర్వహిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారని కూడా అంచనాలు ఉన్నాయి. అయితే.. అంతర్గత మదింపు మాత్రం ఏడాదికి ఒకేసారి ఉంటుందని సీబీఎస్ఈ ప్రకటించింది. విద్యార్థులు సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్‌లలో మూడు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చని వెల్లడించింది. చలికాలం ఎక్కువగా ప్రాంతాల్లోని స్కూళ్లకు చెందిన పదో తరగతి విద్యార్థులకు ఏదో ఒక ఫేజ్‌లో పరీక్షలు రాసే అవకాశం కల్పించింది.
వీటికి సంబంధించిన ముసాయిదా త్వరలో వెల్లడి కానున్నది.