పవన్ కల్యాణ్ తో ‘ఖుషి’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఎస్‌జే సూర్య (Versatile Actor SJ Surya) తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. యాక్టర్‌గా, దర్శకుడిగా (Multiple Talented Technician) ఆయన రాణిస్తున్నారు. ఐదారేళ్ల నుంచి విలక్షణ నటుడిగా ఆయన దక్షిణాది (South Indian Star)లో పేరు తెచ్చుకున్నారు. అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడాయన మెగా ఫోన్ పట్టనున్నారు. దర్శకుడిగా రీఎంట్రీ (Come back Film) ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు.
తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కిల్లర్’(Killer Movie). ఈ సినిమాలో ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు.. చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ తానే సమకూరుస్తున్నారు. శ్రీ గొకులం మూవీస్, ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళ, కన్నడ తదితర భాషల్లో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గొకులం మూవీస్ ఈ సినిమాతో తమిళ సినీరంగంలో కమ్‌బ్యాక్ ఇస్తోంది.
వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ ఈ చిత్రానికి సహ నిర్మాతలు కాగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్‌జే సూర్య ఈ సినిమాకు స్టార్ స్టడెడ్ తారాగణాన్ని తీసుకొస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ సినిమా మిగతా తారాగణం, సాంకేతిక బృందం, కథా నేపథ్యం వంటి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.