end
=
Thursday, July 17, 2025
సినీమావీరోచిత పోరాట చిత్రంలో నేషనల్​ క్రష్​
- Advertisment -

వీరోచిత పోరాట చిత్రంలో నేషనల్​ క్రష్​

- Advertisment -
- Advertisment -

నేషనల్​ క్రష్​ (National Crush) రష్మిక (Actress Rashmika) తన అద్భుతమైన నటనతో ‘కుబేర’ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విమర్శకుల ప్రశంసలు (Got Big applause) అందుకున్నారు. అదే జోష్​తో ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిత్రం పేరు ‘మైసా’ (Mysa Movie). పేరు వినడానికే కొత్తగా ఉంది కదూ. హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో

ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రవీంద్ర పుల్లె డైరెక్టర్‌ (Debut Director Ravindra)గా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాయి గోపా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల క్రితం భారత్​లో గోండు తెగల పోరాటంపై ఈ చిత్రం ఉంటుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో రష్మిక ఫియర్స్, ఇంటెన్స్ లుక్ కట్టిపడేసింది.

సాంప్రదాయ చీరలో, ముక్కుపుడక, ఆభరణాలతో రష్మిక ఒక గోండు జాతి మహిళగా కనిపించారు. ఆమె ఇంటెన్స్ లుక్, రక్తపు మరకలున్న రూపం, ఆమె చేతిలో గట్టిగా పట్టుకున్న ఆయుధం.. అన్నీ చూస్తుంటే.. రష్మిక ఒక శక్తిమంతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. టైటిల్, ఫస్ట్‌లుక్ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లె స్పందిస్తూ..

“మైసా’ అనేది రెండు సంవత్సరాల కష్టం ఫలితం. కథ, ప్రపంచం, కళా దృక్పథం, పాత్రలు.. ప్రతి అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇప్పుడు ఈ కథను ప్రపంచానికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. “ఓర్పు ఆమె ఆయుధం. ఆమె గర్జన వినిపించేందుకు కాదు.. భయపడించేందుకు! రష్మిక మందన్నను ‘మైసా’ పాత్రలో చూడండి, ఆమె ఫియర్స్ అవతార్ ఇదే” అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

ఈ చిత్రానికి సంబంధించి కీలక సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వచ్చే వారం తెలియజేయనున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -