end
=
Friday, August 1, 2025
రాజకీయంబీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖ‌రి
- Advertisment -

బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖ‌రి

- Advertisment -
- Advertisment -

ఢిల్లీ మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (Reservations For BC) కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదించిన బిల్లుపై బీజేపీ నేతలు (BJP Leaders)ఇప్పుడు తలెత్తిన విధంగా మాట్లాడటం ద్వంద్వ ధోరణి(Dual Stand)కి నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)విమర్శించారు. ‘‘అసెంబ్లీలో మద్దతిచ్చిన నేతలే ఇప్పుడు మతం పేరుతో బిల్లును తప్పుబడుతున్నారు.

మేము రూపొందించిన బిల్లులో మత ప్రస్తావన లేదు. కులగణన సర్వే ఆధారంగా రూపొందించాం’’ అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయ‌న‌ న్యూఢిల్లీ(New Delhi)లో మీడియాతో మాట్లాడారు. (Media Chit Chat) ‘బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం ఇప్పటికే పంపించాం. కేంద్ర విపక్ష నేతల మద్దతు కూడా కోరుతున్నాం. బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం’’ అని పేర్కొన్నారు.

సెప్టెంబర్‌లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం, రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ముస్లింల రిజర్వేషన్ల శాతం తొలగించాలని చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గుజరాత్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? తెలంగాణకు మాత్రమే వేరు నిబంధనలు ఎందుకు?’ అని ప్రశ్నించారు.

బీసీలకు కేంద్ర హక్కుల పరిరక్షణలో అన్యాయం జరుగుతోందని విమర్శించిన సీఎం రేవంత్, ‘‘ఓబీసీలకు న్యాయం కావాలి. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారు. ఆయనను ఉప రాష్ట్రపతిగా నియమించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘కులగణన ఆధారంగా మేము ముందుకెళ్తున్నాం. మత అంశం బిల్లులో లేదు. బీజేపీ భావోద్వేగాలపై రాజకీయాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

రైతు చట్టాల విషయంలో ఎలా పోరాటం జరిగిందో, ఇదీ అలాగే సాగుతుంది’’ అని సీఎం స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -