మూడు రోజుల పాటు భారీవర్షాలు
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
ఉత్తర బంగాళాఖాతం (Northern Bay OF Bengal)లో ఏర్పడిన అల్పపీడనం (Low pressure formed) కారణంగా తెలంగాణ వ్యాప్తం(Entire State)గా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rain Fall) కురిసే అవకాశం ఉందని గురువారం హైదరాబాద్ వాతావరణ శాఖ (HYD Meteorological Department) ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి (Low Rainfall) నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని,
అక్కడక్కడా ఉరుములు (Thunder Rift) మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శుక్రవారం ఉదయం సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, వరంగల్, జనగామ, హనుమకొండ, మెదక్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల పరిధిలో అక్కడక్కడ భారీ వర్షసూచన చేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఆ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో ఈ నెల 28 వరకు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.