మృణాల్ ఠాగూర్ (Actress Mrunal Takur).. తెలుగు సినిమా ప్రేక్షకుల (Telugu Film Lovers)కు ఎంతో దగ్గరైన అందాల తార ఆమె. ‘సీతారామం’ చిత్రం (Seetha Ramam Movie)లో ఆమె నటనా కౌశలం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె కథనాయికగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’ (Decoitt). అడివి శేష్ కథానాయకుడు. షనీల్ డియో కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలామే ఆమె బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ నటిస్తున్న ‘సన్ ఆఫ్ సర్దార్ 2’లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్నది. ఇవి కాక మరో నాలుగు సినిమాలనూ లైన్‌లో పెట్టింది మృణాల్. ఇలా ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్న ఈ సుందరి తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మృణాళ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్ (Pod Cast)లో చిట్‌చాట్ (Chit Chat) చేస్తూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
‘నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లలను కనాలనీ ఉంది. తల్లి కావడమనేది నా కల. అయితే, నేనిప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా కెరీర్‌పైనే ఉంది’ అని చెప్పింది. ఇలా నిజాయితీగా తన మనసులో మాట బయటపెట్టిన మృణాల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించింది.