బీసీ రిజర్వేషన్ల (Bc Reservations) అమలుకు గత ప్రభుత్వం(Previous Govt) తెచ్చిన చట్టం అడ్డంకిగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth) ప్రస్తుతం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆ చట్టం అడ్డుకుంటోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్(Sarvai Papanna Goud) విగ్రహానికి భూమిపూజ చేసి ఆయన మాట్లాడారు.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో చేపట్టిన కులగణన(Caste Census)ను వ్యతిరేకించవద్దని ఆయన రాజకీయ పార్టీల(Political Parties)కు సీఎం విజ్ఞప్తి చేశారు. కులగణనలో తప్పులున్నాయని నిరూపిస్తే, తాను క్షమాపణలు చెబుతామన్నారు. రాజకీయ పార్టీలు మద్దతు తెలుపకపోతే బహుజనులకు అన్యాయం చేసినట్టే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పాపన్నగౌడ్ బహుజనులకు ఆదర్శమని,
ఆయన కోటను మైనింగ్ లీజుకు ఇవ్వడం ద్వారా చరిత్రను చెరిపేయాలని గత ప్రభుత్వాలు చూశాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చారిత్రక ప్రదేశాన్ని భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలపడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. అలాగే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న రాహుల్ గాంధీ మాట శిలాశాసనమని పునరుద్ఘాటించారు.