end
=
Monday, December 22, 2025
వార్తలుఅంతర్జాతీయంమళ్లీ పిచ్చిప్రేలాపనలు..భారత్, ఆఫ్ఘనిస్థాన్‌తో రెండు వైపుల యుద్ధానికి సిద్ధమన్న పాకిస్థాన్
- Advertisment -

మళ్లీ పిచ్చిప్రేలాపనలు..భారత్, ఆఫ్ఘనిస్థాన్‌తో రెండు వైపుల యుద్ధానికి సిద్ధమన్న పాకిస్థాన్

- Advertisment -
- Advertisment -

Pakistan: భారత్‌(India)తో సరిహద్దు ఉద్రిక్తతలే కాదు, అఫ్గానిస్థాన్ (Afghanistan)మనకు దగ్గరవడం జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కుతోంది. తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేసింది. పాకిస్థాన్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ (Pakistan Defense Minister Khawaja Asif)తాజాగా ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్‌పై, అఫ్గాన్ శరణార్థులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘‘భారత్ డర్టీ గేమ్స్ ఆడే అవకాశం ఉంది. సరిహద్దు వెంట భారత్ నుంచి ముప్పు ఉండొచ్చు. అలాంటి పరిస్థితే వస్తే, ద్విముఖ యుద్ధానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్నాయి. తాలిబన్‌తో ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, భారత్‌పై మరో ఫ్రంట్ తెరిచే ప్రయత్నాలు పాక్ చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, పాకిస్థాన్ తన దేశంలో నివసిస్తున్న అఫ్గాన్ శరణార్థులపై కూడా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. వారివల్ల పాక్‌కు లాభం లేదే కాదు, కేవలం ఉగ్రవాద కార్యకలాపాల్లోనే పాల్గొంటున్నారు. పాక్‌లో అక్రమంగా ఉన్న వారిని గుర్తిస్తున్నాం. వారు వెంటనే మా దేశాన్ని విడిచి వెళ్లాలి అంటూ భయానక హెచ్చరికలు జారీ చేసింది. ఈ విధంగా, దేశీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను ఇతరులపై మళ్లించే ప్రయత్నంలో పాక్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, పాక్ చేస్తున్న ఆరోపణలకు భారత్ ఘాటుగా స్పందించింది. భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ పాక్ తన మట్టికింద కలుస్తున్న పాలన వైఫల్యాలను మరిచిపోకుండా, పొరుగుదేశాలపై ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఉగ్రవాద సంస్థలకు పాక్ ఇచ్చే ఆతిథ్యం ప్రపంచానికి తెలిసిన సంగతే. అఫ్గానిస్థాన్ తన స్వభూభాగంపై సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటున్నదే తప్ప, ఇది పాక్‌ను రెచ్చగొట్టే చర్య కాదు అని తేల్చిచెప్పింది.

అలాగే, అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఇటీవల భారత రాజధాని ఢిల్లీకి వచ్చిన సమయంలోనే పాక్ సరిహద్దుల్లో కొన్ని దాడులు జరిగినట్టు పేర్కొంటూ, భారత ప్రేరణతోనే దాడులు జరిగాయని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే, దీనికి మద్దతుగా ఎటువంటి ఆధారాలు లేకపోవడమే కాక, దీనిని అసత్య ప్రచారంగా భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. అంతేకాక, ఆ ప్రాంతంలో శాంతిని భంగపరిచే ప్రయత్నాలు ఎవరివైపునుంచైనా వచ్చినా, భారత్ నిశితంగా గమనిస్తోందని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకుంటున్న కఠినమైన వైఖరిని కొనసాగిస్తామని భారత విదేశాంగ శాఖ అధికారులు హైలైట్ చేశారు. ఈ పరిణామాలు చూస్తే, పాకిస్థాన్ తన అంతర్గత సమస్యలను దాచేందుకు మరోసారి భారత్‌పై మతిమరుపు ఆరోపణలు చేస్తూ, శాంతి ప్రయత్నాలకు అడ్డుపడే ప్రకటనలు చేస్తోంది. అఫ్గాన్‌పై ప్రభావం కోల్పోతున్న బాధలో పాక్ చేస్తున్న ఈ విమర్శలు అంతర్జాతీయంగా విశ్వసనీయత కోల్పోతున్నట్టు నిపుణుల అభిప్రాయం.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -