end
=
Sunday, December 21, 2025
వార్తలుజాతీయంసైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు.. రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు
- Advertisment -

సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు.. రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

- Advertisment -
- Advertisment -

Brahmos missiles : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని లఖనౌ సమీపంలోని డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో నిర్మితమైన బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Defence Minister Rajnath Singh) సందర్శించారు. ఈ సందర్భంగా తొలి విడతగా తయారైన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను భారత సైన్యానికి అధికారికంగా అప్పగించారు. ఈ చర్యతో భారత సైన్యం అమ్ములపొదిలో మరింత శక్తిమంతమైన ఆయుధాలు చేరాయి. రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ..బ్రహ్మోస్‌ క్షిపణులు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, యుద్ధ పరిస్థితుల్లో శత్రువుకు సమర్ధవంతమైన ప్రతిస్పందన ఇచ్చేందుకు ఇవి ఉపయుక్తమవుతాయని తెలిపారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ సిందూర్’ విషయాన్ని ప్రస్తావిస్తూ, అది కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని, భారత సైన్యం అవసరమైతే ఎలాంటి స్థాయిలోనైనా తగిన జవాబు ఇచ్చే సత్తా కలిగి ఉందని హెచ్చరించారు.

పాకిస్తాన్‌ మరోసారి దుస్సాహసానికి దిగితే, మన ప్రతిస్పందన ఊహించనిది అయి ఉంటుందని స్పష్టం చేస్తున్నా అంటూ ఆయన కఠినంగా హెచ్చరించారు. అంతేకాక, దేశీయ ఆయుధాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్‌ కీలకమైన కేంద్రంగా ఎదుగుతోందని, ఈ యూనిట్‌తో రాష్ట్రం డిఫెన్స్‌ పరిశ్రమలో మైలురాయిని అధిగమించిందని అన్నారు. ఈ యూనిట్‌లో తయారవుతున్న బ్రహ్మోస్‌ క్షిపణులు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడ్డాయి. 290 కి.మీ. దూరం వరకు లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగల ఈ క్షిపణులు, సుదీర్ఘ పరిశోధన ఫలితంగా భారత్-రష్యా సహకారంతో అభివృద్ధి చేయబడ్డాయి. “ఆత్మనిర్భర్‌ భారత్‌” దిశగా ఇది మరో గంభీరమైన అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించడం ద్వారా దేశ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రక్షణ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రహ్మోస్‌ యూనిట్ ప్రారంభంతో రాష్ట్రానికి ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -