end
=
Monday, December 22, 2025
వార్తలుఅంతర్జాతీయంహెచ్-1బీ ఫీజుపై అమెరికా కీలక ప్రకటన.. వారికి మినహాయింపు!
- Advertisment -

హెచ్-1బీ ఫీజుపై అమెరికా కీలక ప్రకటన.. వారికి మినహాయింపు!

- Advertisment -
- Advertisment -

H-1B Visa: అమెరికా(America)లో విద్యనభ్యసిస్తూ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న భారతీయుల సహా విదేశీ విద్యార్థులకు ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. హెచ్‌-1బీ వీసా ఫీజు(H-1B visa fee) విషయంలో అమెరికా ప్రభుత్వం కీలకంగా స్పందించింది. ఇటీవల హెచ్‌-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల భారీ ఫీజును ప్రవేశపెట్టిన అమెరికా పౌరసత్వ, వలస సేవల సర్వీస్‌ (USCIS) తాజా ప్రకటనలో కీలక విషయాన్ని వెల్లడించింది. USCIS ప్రకారం, ఈ లక్ష డాలర్ల అదనపు ఫీజు అమెరికా వెలుపల నుంచి హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసేవారికే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంటే అమెరికాలో ఇప్పటికే చదువుతూ, అక్కడే ఉద్యోగ అవకాశాల కోసం హెచ్‌-1బీకి దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులకు ఈ అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎఫ్‌-1 వీసాపై ఉన్న విద్యార్థులు హెచ్‌-1బీకి మారితే, వారిపై ఈ అదనపు ఖర్చు భారం ఉండదని స్పష్టంచేసింది.

ఇప్పటికే అమెరికాలో ఉన్న మరియు చెల్లుబాటు అయ్యే వీసా హోదా కలిగిన విదేశీయులు కూడా ఈ మినహాయింపుకు అర్హులు. అంటే, అక్కడే ఉన్నవారు, విద్యావ్యవస్థలో భాగంగా ఉన్నవారు ఈ మార్పుతో ఉపశమనం పొందనున్నారు. ఇది ఉద్యోగం కోసం అమెరికాలోనే ఉన్నవారికి చాలా ఊరట కలిగించే పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ మినహాయింపు సెప్టెంబరు 21, 2025న USCIS వెలువరించిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా అమల్లోకి వస్తుంది. అదే తేదీ తర్వాత దాఖలైన హెచ్‌-1బీ దరఖాస్తులకే ఇది వర్తిస్తుంది. తదుపరి ప్రకటనలలో USCIS ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుల కోసం ప్రత్యేక సేవలను కూడా ప్రారంభించినట్లు తెలిపింది.

ఇది అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద ఊరటగా భావించబడుతోంది. గతంలో హెచ్‌-1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న కఠిన నిబంధనల వల్ల వీసా పొందడంలో అవాంతరాలు ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా మార్పులు విద్యార్థులను ప్రోత్సహించే దిశగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, అమెరికాలో ఉన్నవారు ఉద్యోగం కోసం హెచ్‌-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, లక్ష డాలర్ల అదనపు భారాన్ని మోపాల్సిన పరిస్థితి లేదని తాజా ప్రకటన ద్వారా స్పష్టమైంది. ఈ మార్పు వల్ల అమెరికాలోనే ఉన్న పలువురు విద్యార్థులు తమ ఉద్యోగ కలలకు మరింత దగ్గరవుతారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -