end
=
Sunday, December 21, 2025
వార్తలురాష్ట్రీయంయూఏఈ పర్యటనకు సీఎం చంద్రబాబు ..విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం..
- Advertisment -

యూఏఈ పర్యటనకు సీఎం చంద్రబాబు ..విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం..

- Advertisment -
- Advertisment -

UAE Tour : ఆంధ్రప్రదేశ్‌ (AP)ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మూడు రోజుల విదేశీ పర్యటన కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైపు పయనమయ్యారు. అమరావతి నుండి హైదరాబాద్ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం, ఉదయం 10 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో యూఏఈకు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ కోసం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారిని ఆహ్వానించడం. ఇందులో భాగంగా, యూఏఈలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా సమావేశమవుతున్నారు. యూఏఈ పర్యటన సందర్భంగా ఆయన దుబాయ్‌, అబుదాబి నగరాల్లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

మొదటి రోజు ముఖ్యమంత్రి శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల ప్రతినిధులతో ప్రత్యక్షంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించడంతో పాటు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించనుంది. సాంకేతికత, భవిష్యత్తు నూతన ఆవిష్కరణల ప్రదర్శనకు ప్రసిద్ధిగా ఉన్న ఈ మ్యూజియాన్ని వీక్షించడం ద్వారా, ఆవిష్కరణల దిశగా రాష్ట్ర అభివృద్ధికి ప్రేరణనిచ్చే అంశాలను అధ్యయనం చేయనున్నారు.

ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి యూఏఈలో నిర్వహించనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విదేశీ పెట్టుబడిదారులకు రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలు, కొత్త పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతుల పెంపు వంటి అంశాలపై ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ పర్యటన చివరి రోజు దుబాయ్‌లోని ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్‌టీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో గల్ఫ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో ముఖాముఖి చర్చలతో పాటు, రాష్ట్రాభివృద్ధిలో వారి భాగస్వామ్యం పట్ల పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. యూఏఈ పర్యటన అనంతరం రాష్ట్రానికి తిరిగి చేరుకునే ముఖ్యమంత్రి, విశాఖ సమ్మిట్‌ను అత్యంత విజయవంతంగా మార్చే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన కంపెనీలను ఆహ్వానించిన సీఎం, ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాన్ని కలిగి ఉన్నారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -