end
=
Thursday, January 1, 2026
బిజినెస్‌ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ నెల‌ 30 తర్వాత ఆ సేవలు బంద్
- Advertisment -

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ నెల‌ 30 తర్వాత ఆ సేవలు బంద్

- Advertisment -
- Advertisment -

SBI: దేశవ్యాప్తంగా విస్తృతమైన కస్టమర్‌ బేస్‌ను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) (ఎస్‌బీఐ) తమ వినియోగదారులందరికీ (Users)ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటి వరకు డిజిటల్ చెల్లింపుల్లో (Digital payment)భాగంగా అందిస్తున్న ‘ఎం-క్యాష్’ (m-Cash) సేవను బ్యాంకు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీతో ఈ సదుపాయం ముగుస్తుందని, ఆ తర్వాత ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా లావాదేవీలు చేయడం సాధ్యం కాదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యోనో లైట్ అప్లికేషన్లలో ఎం-క్యాష్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ సేవ ప్రత్యేకత ఏమిటంటే లబ్ధిదారుడి ఖాతా నంబర్‌ని ముందుగా జాబితాలో చేర్చకుండానే, కేవలం వారి మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ఆధారంగా డబ్బు పంపడం, స్వీకరించడం వీలయ్యేది. చిన్న మొత్తపు చెల్లింపులను వెంటనే, సులభంగా పంపించుకోవడానికి ఈ విధానం అనేక మంది కస్టమర్లు ఉపయోగించేవారు. అయితే సేవలను మరింత సురక్షితంగా, ప్రామాణికంగా మార్చే ఉద్దేశంతో ఎం-క్యాష్‌ను నిలిపివేస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో, నగదు బదిలీల కోసం వినియోగదారులు ఇతర ఆధునిక, నమ్మదగిన డిజిటల్ చెల్లింపు అవకాశాలను ఎంచుకోవాలని ఎస్‌బీఐ సూచిస్తోంది. ప్రత్యామ్నాయాలుగా యూపీఐ (UPI), ఐఎంపీఎస్ (IMPS), నెఫ్ట్ (NEFT), ఆర్‌టీజీఎస్ (RTGS) వంటి సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇవి భద్రతా ప్రమాణాల పరంగా శక్తివంతమైనవని, ట్రాన్సాక్షన్లు కూడా వేగంగా పూర్తి అవుతాయని బ్యాంకు పేర్కొంది. యూపీఐ మరింత ప్రజాదరణ పొందుతున్న డిజిటల్ పద్ధతి కావడంతో, ఎం-క్యాష్‌కు సమానమైన సౌలభ్యాన్ని వినియోగదారులు అందులో పొందొచ్చు. లబ్ధిదారుడి వివరాలను ముందుగా జోడించాల్సిన పనిలేకుండా, వారి మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీతోనే వెంటనే డబ్బు పంపే వీలు ఉంటుంది. భీమ్ ఎస్‌బీఐ పే, యోనో వంటి యాప్‌ల ద్వారా ఈ ప్రక్రియను మరింత సులభంగా పూర్తి చేయవచ్చు.

ఇక ఐఎంపీఎస్ సేవ ద్వారా 24 గంటలూ ఎప్పుడైనా తక్షణ బదిలీ చేయవచ్చు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలు బ్యాంకింగ్ అవర్స్‌లో నిర్దేశిత సమయాల్లో పనిచేస్తాయి, అయితే వీటి భద్రత, నమ్మకమైన వ్యవస్థల కారణంగా వినియోగదారులు ఆత్మవిశ్వాసంతో లావాదేవీలు చేయవచ్చు. ఎస్‌బీఐ వెల్లడించిన ఈ తాజా మార్పు కొంతమంది కస్టమర్లకు అసౌకర్యం కలిగించినా, డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా మార్చే దిశగా తీసుకున్న అడుగుగా భావించవచ్చు. బ్యాంకు కస్టమర్లు వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబించాలని సూచించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -