end
=
Monday, January 26, 2026
వార్తలురాష్ట్రీయంచెప్పదా చేవెళ్ల..!
- Advertisment -

చెప్పదా చేవెళ్ల..!

- Advertisment -
- Advertisment -

చెప్పదా చేవెళ్ల..!

Surendra Bandaru : బండెడాశల బతుకు బాటల
మోసుకుంటా మసక మబ్బుల
బయలెల్లిన బస్సు రథం..
ఓర్వలేని విధి సైతం
చెరిపేసే తల రాతలు..
కళ్లు మండి భగవంతుడు బలిగొన్నడు బంధాలను మిగిల్చినడు గర్భశోకాన్ని..!

మూడు తరాల బంధాలు ముగ్గురక్కచెల్లెళ్లు
రాయి నలిపిన చేయి కథ చెప్పదా చేవెళ్ల..!

చేతులెత్తె ఆర్థనాదం
పెద్దోళ్ల సంతాపం
సానుభూతి లాంఛనాలు
పరిహారం ఏం లాభం
తిరిగొస్తరా ఆ బిడ్డలు..!

నలుదిక్కుల చలాన్లుంటే నడిమిట్ల గుంతలేందని
నల్ల బ్యాడ్జి నిలదీస్తే..
మతిలేని తనిఖీలతో
అతివేగమని బదులిచ్చే..!

వచ్చాక ‘రీల్’ అంటే ఎదురుచూసే మీ స్నేహం.. కడచూపు నోచుకోక సొమ్మసిల్లిన కళాశాల..
మీ అల్లరి జ్ఞాపకాలు
ఎప్పటికీ మా గుండెల..!

అన్నింటికి అదే దారి
ఎన్నెన్నో ప్రమాదాలు
అవే అవే కారణాలు
కలగదేమి కనువిప్పు?

తెల్లచొక్కాల అబద్ధాలు సరిదిద్దవా నీలి అక్షరాలు..
ఏ రంగులు పులుముకున్న ఎందాక చీకటి పయనం..
పూడిస్తే మీ తలలు
మారవ మా తల రాతలు..!

చున్ని నెత్తికేసి నిలబడితే.. కొంగు నడుముకు జెక్కి అడుగేస్తే..
షికెలిప్పి శివమెత్తితే.. పరుగెట్టదా నిర్లక్ష్యం?

ఇగ, ఇకనైనా..
గుంతలు నేర్పే పాఠాలు చెవికెక్కేలా..
రక్తదాహం కోరే రహదారుల మెత్తేలా..
నీతి లేని నేతల ముసుగులు తొలగేలా.. తెల్లకారుల అల్లె కథల
గుంజి గుంజి నిలదీద్దాం పగబట్టి ప్రశ్నిద్దాం..

-సురేంద్ర బండారు
(90108 47120)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -