end
=
Saturday, January 24, 2026
వార్తలుజాతీయంబంగ్లాదేశ్‌లో భూకంపం..వణికిన పశ్చిమ బెంగాల్..ప్రజల్లో భయాందోళనలు
- Advertisment -

బంగ్లాదేశ్‌లో భూకంపం..వణికిన పశ్చిమ బెంగాల్..ప్రజల్లో భయాందోళనలు

- Advertisment -
- Advertisment -

Earthquake: పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఈ ఉదయం సంభవించిన భూకంపం ప్రభావం పశ్చిమ బెంగాల్‌(West Bengal)ను కూడా బలంగా తాకింది. కోల్‌కతా (Kolkata)సహా రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో అర్ధాంతరంగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కదలికలు మొదలైన వెంటనే ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్న వారు ఎవరికి తోచినట్లు బయటకు పరుగులు పెట్టారు. కొద్ది క్షణాల వ్యవధిలోనే అనేక అపార్ట్‌మెంట్లలో అలారాలు మోగడం, జనాలు మెట్లు దిగి రోడ్లపైకి రావడం వంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 10:08 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించినట్లు భూకంప విభాగం వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని నర్సింగ్ది ప్రాంతానికి 13 కిలోమీటర్ల దూరంలోనే భూ ప్రకంపన కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

రిక్టర్ స్కేలు పై 5.2 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించడం వలన కంపనలు మరింతగా స్పష్టంగా అనిపించాయి. అందువల్ల ఉదయం నిదానంగా సాగుతున్న నగర జీవితం ఒక్కసారిగా నిలిచిపోయినట్లు మారింది. కోల్‌కతా నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాలు అయిన బారానగర్, హౌరా, దుమ్‌దుం, సాల్ట్‌లేక్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం ఘాటుగా కనిపించింది. కార్యాలయాల్లో వున్న ఉద్యోగులు, షాపింగ్ మాల్స్‌కి వచ్చిన ప్రజలు, అపార్ట్‌మెంట్‌ల్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కొన్ని క్షణాల పాటు ఏం జరుగుతుందో అర్థం కాక భయపడిపోయారు. కాగా, కాన్ఫరెన్స్ కాల్‌లో ఉండగా అకస్మాత్తుగా కుర్చీ కదిలింది. మొదట ఏమైందో అర్థం కాలేదు. కొన్ని సెకన్లకే అది భూకంపమని గ్రహించా. ఇంత తీవ్రంగా కంపించడాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ అనుభవించలేదు అంటూ బారానగర్‌కు చెందిన ప్రియాంక చతుర్వేది తెలిపారు.

ప్రకంపనలు సుమారు అర నిమిషం పాటు కొనసాగాయి. మొదట నాకు తల తిరుగుతోందేమో అనిపించింది. కానీ ఇంట్లో ఉన్నవారు కూడా అదే అనుభవించడంతో అది భూకంపమని స్పష్టమైంది అని అలీపూర్‌కు చెందిన 75 ఏళ్ల రవీంద్ర సింగ్ చెప్పారు. ఇక, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే భయాందోళనలో బయటకు పరుగులు తీయడం వల్ల కొందరు స్వల్ప గాయాలు పాలయ్యే అవకాశం ఉన్నదేమోనని అధికారులు పరిశీలిస్తున్నారు. భవనాల్లో ఉన్న భద్రతా వ్యవస్థలను సైతం పూర్తిగా సమీక్షిస్తున్నారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఈ ఆకస్మిక భూగర్భ చలనం నగర జీవితాన్ని కొన్ని క్షణాల పాటు కలవరపరిచినప్పటికీ, పెద్దగా నష్టం జరగకపోవడం ఉపశమనకర అంశంగా భావిస్తున్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -