end
=
Monday, January 26, 2026
వార్తలుఅంతర్జాతీయంఅమెరికాలొ కాల్పుల మోత.. వైట్‌హౌస్‌కు సమీపంలోనే సైనికులపై దాడి
- Advertisment -

అమెరికాలొ కాల్పుల మోత.. వైట్‌హౌస్‌కు సమీపంలోనే సైనికులపై దాడి

- Advertisment -
- Advertisment -

White House: వాషింగ్టన్‌(Washington)లో ఉదయం కలకలం రేగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు స‌మీపంలో జరిగిన కాల్పుల ఘటన(shooting incident) నగరాన్ని భారీగా కుదిపేసింది. ఈ దాడిలో వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్‌కు చెందిన ఇద్దరు సభ్యులు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇది యాదృచ్ఛిక ఘటన కాదని, సూటిగా లక్ష్యంగా చేసుకున్న దాడి అని వాషింగ్టన్‌ మేయర్‌ మురియల్‌ బౌజర్ స్పష్టం చేశారు. వివరాలకు వస్తే సాధారణ భద్రతా పర్యవేక్షణలో ఉన్న ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యుల వద్దకు ఒక అనుమానాస్పద వ్యక్తి చేరుకుని అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు మొదలుపెట్టాడు. ఆరంభంలో ఆకస్మిక దాడితో సైనికులు అప్రమత్తం కావడానికి కొంత సమయం పట్టినప్పటికీ, వారిలో ఒకరు వెంటనే ప్రతిగా కాల్పులు జరపడంతో దుండగుడు కూడా గాయపడ్డాడు.

వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని గాయాలు ప్రాణాపాయం లేనివిగా ఉన్నప్పటికీ విచారణ కోసం ఆసుపత్రిలోనే పోలీస్ కస్టడీలో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకు ప్రత్యేకంగా నేషనల్ గార్డ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకున్నాడు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. దుండగుడి వ్యక్తిగత సమాచారాన్ని, నేపథ్యాన్ని, అతడి మోటివ్‌ను అధికారులు సవివరంగా పరిశీలిస్తున్నారు. ఇటీవలి కాలంలో వాషింగ్టన్‌లో నమోదవుతున్న నేరాల శ్రేణి దృష్ట్యా ఈ దాడి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సైనికులపై తుపాకీ తన్నిన వారికి కఠిన శిక్ష తప్పదని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మన జవాన్లు, భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు దేవుడు కాపాడాలి అని కూడా సందేశం ఇచ్చారు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రజలను గాయపడిన సైనికుల కోసం ప్రార్థించమని కోరారు.

ఇటీవల నేరాలను నియంత్రించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు నెలలో వాషింగ్టన్‌లో నేషనల్ గార్డ్‌ను పెద్ద ఎత్తున మోహరించింది. ఈ నిర్ణయం అప్పటినుంచి రాజకీయ వర్గాల్లో చర్చకు, విమర్శకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గార్డ్ సభ్యులపై జరిగిన ఈ దాడి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు అదనపు భద్రతా ఏర్పాట్లు చేపట్టి, దర్యాప్తు వేగవంతం చేశారు. వైట్‌హౌస్ సమీపంలో ఇలా బహిరంగంగా కాల్పులు జరగడం దేశ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా, ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. పరిశోధన పూర్తి అయ్యే వరకు అధికారులు అప్రమత్తతతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -