end
=
Monday, January 26, 2026
వార్తలుజాతీయంఢిల్లీ పేలుడు ఉగ్ర కుట్ర సీన్‌ రీక్రియేషన్‌.. అల్‌-ఫలాకు డాక్టర్‌ షాహిన్‌
- Advertisment -

ఢిల్లీ పేలుడు ఉగ్ర కుట్ర సీన్‌ రీక్రియేషన్‌.. అల్‌-ఫలాకు డాక్టర్‌ షాహిన్‌

- Advertisment -
- Advertisment -

Delhi blast : ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన చర్యలను వేగవంతం చేసింది. ఫరీదాబాద్‌ (Faridabad) లో వెలుగులోకి వచ్చిన ఉగ్ర మాడ్యూల్‌పై విచారణను విస్తరించిన NIA అధికారులు, ప్రధాన నిందితుల్లో ఒకరైన డాక్టర్ షాహిన్‌ (Dr. Shaheen)ను సీన్ రీక్రియేషన్ కోసం అల్‌-ఫలా విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్లారు. ఆమెతోపాటు అరెస్టైన మరో ఏడుగురు నిందితులను వివిధ ప్రాంతాలకు తరలించే ప్రణాళిక కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఈ నిందితులను లఖ్‌నవూ, కాన్పూర్, సహరన్‌పూర్, ఫరీదాబాద్, జమ్మూకశ్మీర్ వంటి ప్రాంతాలకు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ప్రతి నిందితుడికి అక్కడి వ్యక్తులతో ఉన్న సంబంధాలు, వారికి లభించిన సహకారం, స్థానిక స్థాయిలో నెట్‌వర్క్ పనిచేసే విధానం వంటి అంశాలను తెలుసుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

అల్‌-ఫలా క్యాంపస్‌లో దర్యాప్తు అనంతరం, డాక్టర్ షాహిన్‌ను లఖ్‌నవూ, కాన్పూర్ ప్రాంతాల్లో మరింత విచారణకు హాజరు పరచాల్సి ఉందని సమాచారం. ఆమె సంబంధాల వలయం ఎంతదూరం వ్యాపించింది? ఆ నెట్‌వర్క్‌లో విద్యావంతులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, క్లినిక్‌ల ద్వారా ఈ మాడ్యూల్ కార్యకలాపాలు సాగించబడుతున్నాయని NIA గుర్తించినట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపధ్యంలో NIA అధికారులు డాక్టర్ షాహిన్‌తో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. దాదాపు రెండు సంవత్సరాలుగా అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు షాహిన్ విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ పదార్థాలను ఉపయోగించి పాకిస్థాన్‌కు చెందిన జైషే ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని కుట్ర పన్నినట్లు సమాచారం.

తాజా విచారణలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. సహనిందితుడు ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహిన్ తన భార్య అని, అల్‌-ఫలా విశ్వవిద్యాలయం సమీపంలోని మతపరమైన ప్రదేశంలో వారి వివాహం జరిగినట్లు పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా, భారత్‌లో జైషే-మొహమ్మద్ మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేయాలంటూ షాహిన్ ఆన్‌లైన్ కోర్సులు నిర్వహించిందని నిఘా వర్గాలు గుర్తించాయి. దీనితో, అల్‌-ఫలా విశ్వవిద్యాలయంలోని ఇతర మహిళా వైద్యులను కూడా ఆమె ప్రభావితం చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఉగ్ర మద్దతుదారులు ఉన్నారా? నిధుల సమీకరణ, ప్రచారం, నియామకాలకు విద్యాసంస్థలు కేంద్రాలుగా ఉపయోగించబడాయా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నెట్‌వర్క్‌ వెనుక ఉన్న ఇతర కీలక వ్యక్తులను గుర్తించడం కోసం నిఘా సంస్థలు సమగ్ర మానిటరింగ్ చేపట్టాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -