. రాంనగర్లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసీ బాయ్స్ స్కూల్‌ల్లో సైన్స్ ఫెస్ట్
. శాస్త్రసాంకేతిక ఆవిష్కరణలతో అద్భుతాలు చూపిన విద్యార్థులు
. విజ్ఞానంతో వెలుగొందిన విద్యార్థుల ప్రతిభ
. సృజనాత్మక మేధస్సుకు వేదికగా సైన్స్ ఎగ్జిబిషన్
Ramnagar: విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానం పెంపొందించేందుకు శాస్త్రీయ ఆవిష్కరణల ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. రాంనగర్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసీ బాయ్స్ స్కూల్(St. Francis of Assisi Boys School)ల్లో పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష విజ్ఞానం, నీటి సంరక్షణ, వైద్య శాస్త్రం, ట్రాఫిక్ సేఫ్టీ, వ్యవసాయ సాంకేతికతలు, మరియు బుర్రకథ, పేరిణి నృత్యం, గుస్సాడీ ఆటాలు, బంజారా ఆటలు, డప్పు వాయిద్యాలు, జానపద కళ ప్రదర్శన తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో 400కి పైగా మోడల్స్ ప్రదర్శించగా, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

ఆకట్టుకున్న ప్రాజెక్టులు
ప్లాస్టిక్ మాలిన్యాల వల్ల కలిగే నష్టం, పర్యావరణ రక్షణపై రూపొందించిన మోడల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. దినచర్యలో చిన్నచిన్న మార్పులతోనే వాతావరణాన్ని కాపాడుకోవచ్చని విద్యార్థులు వివరించారు.
డిజిటల్ ఇండియా
డిజిటల్ సేవల ప్రయోజనాలను వివరిస్తూ పలు మోడల్స్‌ను విద్యార్థులు ప్రదర్శించారు. వైద్యం, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు వంటి అంశాలపై తమ విజ్ఞానాన్ని పంచుకున్నారు.

భవిష్యత్తు టెక్నాలజీలపై పరిశోధనాత్మక చూపు
రోబోటిక్స్, స్మార్ట్ సిటీస్, పునరుత్పాదక శక్తి వినియోగంపై చూపిన ప్రదర్శనలు ప్రశంసలు పొందాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యార్థులు వివరాలు తెలియజేశారు.
ప్రకృతి ప్రేమ..
సేంద్రీయ వ్యవసాయం, విత్తనాల సంరక్షణపై విద్యార్థులు రూపొందించిన మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హృదయ ఆరోగ్యంపై స్టూడెంట్ ప్రత్యేక ప్రదర్శన.. రాంగనగర్లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి బాప్టిస్ట్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు హృదయ నిర్మాణం, రక్త ప్రసరణ విధానంపై అద్భుతమైన మోడల్ను ప్రదర్శించారు. ఒక విద్యార్థి AI టెక్నాలజీని ఉపయోగించి హృదయం పనితీరును టాబ్లెట్ సాయంతో చూపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. “ఈ తరహా ప్రదర్శనలు విద్యార్థులకు విశ్వసనీయమైన నేర్పును అందిస్తాయని పేర్కొన్నారు. రేపటి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఈ తరగతి నుంచే తయారవుతారని అన్నారు. అనంతరం సందర్శకులు విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. “ఈ తరహా విజ్ఞాన ప్రదర్శనలు, విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం పెంపొందించేందుకు ఎంతో తోడ్పడతాయి. రేపటి శాస్త్రవేత్తలు, టెక్నాలజీ నాయకులు ఇలాంటి కార్యక్రమాల నుంచే రూపుదిద్దుకుంటారు” అన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను సందర్శకులు అభినందించారు.

