end
=
Sunday, January 25, 2026
వార్తలుఅనుకోని అవకాశంతో సినీ రంగంలోకి..కొత్త ప్రయాణంలో కృతి శెట్టి
- Advertisment -

అనుకోని అవకాశంతో సినీ రంగంలోకి..కొత్త ప్రయాణంలో కృతి శెట్టి

- Advertisment -
- Advertisment -

Krithi Shetty: ‘ఉప్పెన’తో తొలి సినిమాకే (Uppena movie)తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుని ఓవర్‌నైట్ స్టార్‌(Overnight Star)గా వెలుగొందిన కృతి శెట్టి, తాను సినిమాల్లోకి వచ్చిందీ పూర్తిగా యాదృచ్ఛికమే అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో వరుస అవకాశాలతో దూసుకెళ్లిన ఆమె, ఇటీవల ఫ్లాపుల కారణంగా కొంత వెనుకబడినప్పటికీ, ఇప్పుడు తమిళ చిత్రాలపై దృష్టి పెట్టి మళ్లీ గాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కెరీర్ ఆరంభం ఎలా జరిగిందన్న ప్రశ్నకు కృతి ప్రత్యేకంగా స్పందిస్తూ, “ఒక కమర్షియల్ యాడ్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి స్టూడియోకి వెళ్లాను. ఆడిషన్ ముగిసిన తర్వాత నాన్న తీసుకెళ్తానన్నా, ఆయనకు అప్పటికి టైమ్ అయ్యింది. నేను అక్కడ ఎదురుచూస్తూ ఉంటే పక్కనే ఉన్న మరో స్టూడియోలో జనం కదలికలు కనిపించాయి. ఆసక్తితో వెళ్లి చూస్తే సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. అక్కడి టీమ్ సభ్యులు నన్ను చూసి ‘నటించాలన్న ఆసక్తి ఉందా?’ అని అడిగారు. ఏం చెప్పాలో అర్థంకాక అమ్మ ఫోన్ నంబర్ ఇచ్చాను. కొద్ది సేపటికి వారే అమ్మకు కాల్ చేసి నాకు ఆడిషన్‌కి రావాలని చెప్పారు. అలా పూర్తిగా ఊహించని రీతిలో నాకు ‘ఉప్పెన’లో హీరోయిన్ ఛాన్స్ దొరికింది. నిజంగా అది కలలాంటిదే” అని చెప్పుకొచ్చింది.

‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత కృతికి తెలుగు పరిశ్రమలో అవకాశాలు వెల్లువెత్తాయి. నానితో చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’, నాగచైతన్యతో ‘బంగార్రాజు’ చిత్రాలు సాధారణ స్థాయిలోనే నిలిచినా, ఆ తర్వాత వచ్చిన ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కస్టడీ’, ‘మనమే’ వరుసగా నిరాశపరిచాయి. దీంతో ఆమె కెరీర్ గ్రాఫ్ కొంత క్షీణించింది. కొత్తగా వచ్చిన కథలు తగ్గిపోయాయి. ఒక దశలో ఆమె కెరీర్ పునరుద్ధరణపై అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దికాలం గ్యాప్ తీసుకున్న కృతి, తాజాగా తమిళలో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ‘వా వాతియార్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే రెండు కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలకు తమిళ ఇండస్ట్రీలోనే కాదు, తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సరైన కథలు, బలమైన పాత్రలు దొరికితే కృతి మళ్లీ తన సత్తా చాటుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. కోలీవుడ్‌లోని ఈ కొత్త ప్రయాణమే ఆమెకు తిరిగి విజయపథం చూపుతుందేమో అన్న ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. కృతి కూడా అదే ఉత్సాహంతో తన రెండో ఇన్నింగ్స్‌ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -