end
=
Tuesday, December 2, 2025
రాజకీయంహిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్‌ పోరు బాట
- Advertisment -

హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్‌ పోరు బాట

- Advertisment -
- Advertisment -

BRS: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP)పై రాజకీయ కుమ్ములాట కొనసాగుతూనే ఉంది. హిల్ట్ పాలసీ(Hilt policy) పేరుతో భారీ భూ కుంభకోణానికి(Huge land scam ) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)మార్గం సుగమం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో, పార్టీ ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను అక్రమంగా రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తున్న బీఆర్ఎస్, ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలపై, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎనిమిది నిజనిర్ధారణ కమిటీలను(Fact Finding Committee) ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులతో కూడిన ఈ కమిటీలు రాబోయే రెండు రోజుల పాటు హిల్ట్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాలను సందర్శించనున్నాయి.

అక్కడ జరుగుతున్న మార్పులు, ప్రభుత్వ చర్యలు, ప్రజలకు కలిగే ప్రభావం వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని సాధారణ ప్రజలకు వివరణాత్మకంగా తెలియజేయాలని పార్టీ నిర్ణయించింది. నిజనిర్ధారణ కమిటీల నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కేటీఆర్ కీలక సూచనలు చేశారు. హిల్ట్ పేరుతో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న రూ.5 లక్షల కోట్ల కుంభకోణం వెనుక ఉన్న నిజాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలు ఏర్పాటు కోసం, యువతకు ఉపాధి కల్పన కోసం పూర్వ ప్రభుత్వాలు తక్కువ ధరలకు కేటాయించిన పారిశ్రామిక భూములను ‘మల్టీ యూజ్ జోన్’ పేరిట రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం అనుకోవడం ప్రజల దోపిడీ అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

సుమారు 9,300 ఎకరాల విలువైన భూములను మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువైన ఎస్ఆర్ఓ రేటులో కేవలం 30 శాతం విలువకు రెగ్యులరైజ్ చేయడం ద్వారా భారీగా ప్రజల ధనాన్ని ఖాజానాకు కాకుండా ఇతరుల జేబులకు చేరేలా చేసే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. పేదలకు ఇండ్లు కట్టడానికి భూమి లేదని చెప్పే ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు అందజేస్తోందని ఆయన మండిపడ్డారు. హిల్ట్ భూముల వ్యవహారంలో జరుగుతున్న అసంగతాలను ఎదిరించేందుకు బీఆర్ఎస్ ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పునాది వేస్తోంది. ప్రజల భూములను, ప్రజల హక్కులను రక్షించేందుకు ఈ పోరాటం కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

నిజనిర్ధారణ బృందాల పర్యటన వివరాలు:

క్లస్టర్-1లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శిస్తారు.

క్లస్టర్-2లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణీ దేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు.

క్లస్టర్-3కు సంబంధించి మధుసూదనాచారి, మర్రి రాజశేఖర్ రెడ్డి, రవీందర్ రావు మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామిక వాడలను విజిట్ చేస్తారు.

క్లస్టర్-4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

క్లస్టర్-5లో తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నవీన్ రావు సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు.

క్లస్టర్-6లో చామకూర మల్లారెడ్డి, శంభీపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కుకు వెళ్తారు.

క్లస్టర్-7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వామి గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి కాటేదాన్, హయత్ నగర్‍లో పర్యటిస్తారు.

క్లస్టర్-8లో మాజీ మంత్రి మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్, ఎండీ సలీం చందులాల్ బారాదరి పారిశ్రామిక వాడను సందర్శిస్తారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -