end
=
Monday, January 26, 2026
వార్తలుజాతీయంప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
- Advertisment -

ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత

- Advertisment -
- Advertisment -

AVM Saravanan: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ(Film industry)కు చిరస్మరణీయ సేవలు అందించిన ఏవీఎం ప్రొడక్షన్స్ (AVM Productions)అధినేత, ప్రముఖ చిత్ర నిర్మాత ఏవీఎం శరవణన్ (AVM Saravanan)(85) కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో తమిళ, తెలుగు చిత్ర వర్గాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. చిత్రసీమలో నాలుగు దశాబ్దాలకు పైగా ప్రతిష్ఠాత్మక చిత్రాలను అందించిన ఆయన అకస్మిక వైదొలగటం సినీ ప్రపంచానికే పెద్ద షాక్‌గా మారింది. ఏవీఎం స్టూడియోలను ప్రారంభించిన ఏవీ మేయప్పన్ గారి వారసుడైన శరవణన్, తండ్రి మరణానంతరం నిర్మాణ సంస్థ బాధ్యతలను తీసుకుని ఏవీఎం బ్రాండ్‌ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు.

ఎంజీఆర్, శివాజీ గణేశన్, జయలలిత, రజనీకాంత్, కమల్ హాసన్ నుంచి ఆధునిక తరం నటుల వరకూ ఆయన బ్యానర్‌లో నటించిన స్టార్‌ హీరోల జాబితా చాలా పెద్దది. ఆయనే నిర్మించిన సినిమాలు సాంకేతికంగా, వినోదపరంగా అప్పటికప్పటి ప్రమాణాలను పెంచినవిగా భావిస్తారు. తెలుగులో “సంసారం ఒక చదరంగం”, “లీడర్”, “జెమినీ” వంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించగా, తమిళంలో “శివాజీ”, “మెరుపు కలలు” వంటి సూపర్‌హిట్ సినిమాలతో ఏవీఎం స్టూడియో ప్రతిష్ఠను మరోస్థాయికి చేర్చారు. మొత్తం వివిధ భాషలలో 176కు పైగా చిత్రాలు నిర్మించడం ద్వారా దక్షిణాది సినిమా చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు.

సినిమాలకే పరిమితం కాని శరవణన్, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అనేక టీవీ సీరియళ్లను కూడా రూపొందించారు. 2014లో విడుదలైన “ఇదువుమ్ కదాందు పొగుమ్” ఏవీఎం బ్యానర్‌లో వచ్చిన చివరి ఫీచర్ ఫిల్మ్ కాగా, 2022లో అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో రూపొందించిన “తమిళ్‌రాకర్స్” వెబ్‌సిరీస్ ఆయన నిర్మించిన చివరి ప్రాజెక్ట్‌గా నిలిచింది. శరవణన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు ఎంఎస్ గుహన్ కూడా చిత్ర నిర్మాణంలో కొనసాగుతున్నారు. శరవణన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు, సినీనటులు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెలువరిస్తూ, ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమను రూపుదిద్దిన కీలక నిర్మాతను కోల్పోయిన శోకంలో సినీ కుటుంబం మునిగిపోయింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -