end
=
Monday, January 26, 2026
వార్తలుజాతీయంఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ..శీతాకాల సమావేశాల్లో వేడి రాజకీయం
- Advertisment -

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ..శీతాకాల సమావేశాల్లో వేడి రాజకీయం

- Advertisment -
- Advertisment -

NDA alliance : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు (Winter Sessions of Parliament) తీవ్రంగా సాగుతున్న ఈ తరుణంలో, రాజధానిలోని పార్లమెంట్‌ లైబ్రరీ (Parliament Library) భవనం ఈ ఉదయం మరో కీలక సమావేశానికి వేదికైంది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేసానికి లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన ఎన్డీయే సభ్యులు (NDA members)విస్తృతంగా హాజరయ్యారు. కూటమిలో భాగమైన ప్రధాన పార్టీల ఎంపీలు పాల్గొన్న ఈ భేటీలో, దేశీయ రాజకీయ పరిణామాలు, శీతాకాల సమావేశాల వ్యూహాలు, ముందనున్న చట్టపరమైన కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చ జరిగింది.
ఈ సమావేశానికి ప్రత్యేక హైలైట్‌గా ఇటీవల ముగిసిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన విశేష విజయంపై ఏర్పాటైన సన్మాన కార్యక్రమం నిలిచింది.

ఈ ఎన్నికల్లో కూటమి సాధించిన రికార్డు స్థాయి ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవగా, ఎన్డీయే నేతలు ఈ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వానికి అంకితం చేశారు. ఊహించని స్థాయిలో వచ్చిన ఈ గెలుపు నేపథ్యంలో, మోదీకి కూటమి ఎంపీలంతా ఘన సత్కారం చేసి, ఆయన నేతృత్వాన్ని ప్రశంసించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, అనేక కీలక మంత్రులు, మిత్రపక్షాల నేతలు ఈ కార్యక్రమంలో హాజరై తమ అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్‌ వేదికపై ఇవాళ మరో ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. లోక్‌సభలో అత్యంత ప్రాధాన్యంతో ఉన్న ఎస్‌ఐఆర్‌ (SIR) పై సుమారు 10 గంటలపాటు విస్తృత చర్చను నిర్వహించేందుకు నిర్ణయించారు.

ఈ చర్చను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రారంభించనుండటంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోని అన్ని పార్టీలూ తమ ఎంపీలందరూ తప్పనిసరిగా సభకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసాయి. విపక్షం ప్రభుత్వాన్ని ఈ చర్చలో కఠినంగా నిలదీయాలనే ప్రయత్నాలు చేస్తుండగా, అధికారపక్షం తమ వాదనలను బలంగా సమర్థించుకోవడానికి సిద్ధమవుతోంది. రాజ్యసభలో కూడా ఇదే వేడి కొనసాగనుంది. దేశభక్తి, జాతీయ గౌరవానికి ప్రతీకైన వందేమాతరం పై చర్చను పై సభలో చేపట్టనున్నారు. ఈ చర్చలో వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుచనుండటంతో, పై సభలో కూడా ఆసక్తికరమైన వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద, ఎన్డీయే సమావేశం నుండి సభల్లో జరగబోయే ముఖ్య చర్చల వరకూ, నేటి రోజు పార్లమెంట్‌ రాజకీయంగా అత్యంత ఉత్కంఠభరితంగా మారబోతోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -