end
=
Friday, December 12, 2025
వార్తలుఆ షో వల్లే నా కెరీర్‌ దెబ్బతింది: కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు
- Advertisment -

ఆ షో వల్లే నా కెరీర్‌ దెబ్బతింది: కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు

- Advertisment -
- Advertisment -

Karate Kalyani : తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో (Reality show)బిగ్‌బాస్(Bigg Boss) గురించి ప్రముఖ నటి కరాటే కల్యాణి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బిగ్‌బాస్‌లో పాల్గొనడం తనకు మంచి అవకాశాలు కాకుండా పెద్ద నష్టాన్నే మిగిల్చిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంతో వెల్లడించారు. ఈ రియాలిటీ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన సినీ ప్రయాణం అట్టడుగుకు చేరిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్‌లో నాకు లాభం జరగలేదు. నేను సంపాదించిన దానికంటే రెండింతలు నష్టపోయాను. షోకి వెళ్లిన తర్వాత సినిమా ఆఫర్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అగ్రిమెంట్ ఉండడం వల్ల అనేక మంచి అవకాశాలు నా చేతిలోంచి జారిపోయాయి.

బయటకు వస్తే పెద్ద అవకాశాలు వస్తాయన్న ఆశతో వెళ్లాను. కానీ ఎవరూ పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. బిగ్‌బాస్‌ వల్లే నేను ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అని చెప్పారు. కరాటే కల్యాణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లలో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం ఆమెపై విమర్శలు గుప్పిస్తూ, “షో వల్ల నష్టం అవుతుందని తెలిసినా ఎందుకు వెళ్లారు?”,“అవకాశాలు రావడమన్నది వ్యక్తిగత ప్రతిభ, షో మీద మాత్రమే ఆధారపడదు” అని ప్రశ్నిస్తున్నారు.మరొకవైపు, కొందరు మాత్రం ఆమె మాటల్లో నిజం ఉండొచ్చని అంటున్నారు. రియాలిటీ షోలలో భాగస్వామ్యం కావడం కొన్నిసార్లు ప్రతికూల ప్రభావం చూపుతుందని, బయటకు వచ్చిన తర్వాత కాంట్రాక్టులు, గడువులు, ఇమేజ్ మార్పు వంటి కారణాలతో కొందరు ఆర్టిస్టులకు సమస్యలు ఎదురవుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.

తెలుగు ప్రేక్షకుల్లో అపార పాప్యులారిటీ సాధించిన బిగ్‌బాస్ షోపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. పలు సెలబ్రిటీల కెరీర్‌కు ఈ షో ఊపిరి పోసిన సందర్భాలు ఉన్నా, కల్యాణి వంటి కొందరికి నష్టాన్ని మిగిల్చిందనే అభిప్రాయం మరో కోణాన్ని వెలుగులోకి తీసుకువస్తోంది. కరాటే కల్యాణి వ్యాఖ్యలతో మళ్లీ బిగ్‌బాస్ షో స్వభావం, కాంట్రాక్ట్ షరతులు, పాల్గొనే వారి ఇమేజ్‌పై పడే ప్రభావం గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ వివాదంపై షో నిర్వాహకులు ఏమంటారనే ఆసక్తి కూడా పెరిగింది.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -