end
=
Monday, December 22, 2025
రాజకీయంఅసెంబ్లీకి రండి.. గౌరవంగా చూసుకుంటా!: కేసీఆర్‌కు రేవంత్ సవాల్
- Advertisment -

అసెంబ్లీకి రండి.. గౌరవంగా చూసుకుంటా!: కేసీఆర్‌కు రేవంత్ సవాల్

- Advertisment -
- Advertisment -

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణా నదిలో కలిపేసిన బాధ్యత పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పైనేనని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సమగ్రంగా చర్చించేందుకు జనవరి 2 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. తన నివాసంలో మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అబద్ధాల మీద రాజకీయాలు చేస్తున్నారని, కరుడుగట్టిన నేరగాడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన పాలనలో తీసుకున్న తప్పు నిర్ణయాల వల్లే పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. చేతనైతే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

ఒక రోజు కృష్ణా జలాలపై, మరో రోజు గోదావరి అంశంపై చర్చిద్దాం. కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత నాది. ఆయన నిజంగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారో లేదో సభకు వస్తే తెలుస్తుంది. తన తరఫున చెంచాలను పంపితే వారితో చర్చ ఉండదు అని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేవలం 36 శాతానికి, అంటే 299 టీఎంసీలకే పరిమితం చేస్తూ సంతకం పెట్టింది నిజం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టులను అప్పట్లో కేసీఆర్ ఎలా సమర్థించారో తన ఫోన్‌లోని వీడియోల ద్వారా మీడియాకు చూపించారు. పట్టిసీమ ప్రాజెక్టును అభినందించడం, రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాలని చంద్రబాబుకు సూచించడం వెనుక అసలు ఉద్దేశమేంటని నిలదీశారు.

నీళ్లు మూతి దగ్గర దక్కాల్సిన రాష్ట్రానికి తోక దగ్గర తీసుకునేలా ఒప్పందాలు చేసుకుని, పైపులు–కాంట్రాక్టుల కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. కృష్ణా నదిపై ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల్లో పదేళ్లలో ఒక్కటైనా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్, కేటీఆర్ తీవ్ర దాడి చేశారని వ్యాఖ్యానించిన సీఎం, వారిద్దరినీ ‘ఆర్థిక ఉగ్రవాదులు’గా అభివర్ణించారు. 12 శాతం వడ్డీతో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, తమ ప్రభుత్వం వచ్చాక వడ్డీని 7.1 శాతానికి తగ్గించి అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏటా రూ.4 వేల కోట్లు ఆదా చేస్తున్నామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సీబీఐ విచారణకు కేంద్రం సహకరించకపోవడం చూస్తే బీజేపీ–బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్టే స్పష్టమవుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -