end
=
Friday, December 26, 2025
వార్తలుజాతీయంరాష్ట్రపతి చేతుల మీదుగా ‘బాల పురస్కారం’ అందుకున్న వైభవ్ సూర్యవంశీ
- Advertisment -

రాష్ట్రపతి చేతుల మీదుగా ‘బాల పురస్కారం’ అందుకున్న వైభవ్ సూర్యవంశీ

- Advertisment -
- Advertisment -

Bihar : బిహార్‌కు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (cricketer Vaibhav Suryavanshi) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. క్రీడల రంగంలో అసాధారణ ప్రతిభను కనబరిచినందుకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’(Bal Puraskar)ను ప్రకటించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) చేతుల మీదుగా వైభవ్ ఈ అవార్డును స్వీకరించారు.

చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌కు ఈ పురస్కారం లభించడం బిహార్ క్రికెట్ వర్గాల్లోనే కాకుండా భారత క్రీడా ప్రపంచంలోనూ ఆనందాన్ని నింపింది. అయితే, ఈ అవార్డు కార్యక్రమం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో మణిపూర్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు వైభవ్ దూరంగా ఉండాల్సి వచ్చింది. అవార్డు వేడుకలో పాల్గొనడానికి ఉదయం 7 గంటలకే రాష్ట్రపతి భవన్‌కు హాజరుకావడంతో అతను మ్యాచ్ ఆడలేకపోయాడు.

అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ అద్భుతంగా బ్యాట్ ఝళిపించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే 190 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఇన్నింగ్స్ అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు అతను కీలక ఆటగాడిగా మారతాడన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి.

పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ అవార్డు పొందిన చిన్నారులందరినీ అభినందించారు. “మీ విజయాలు దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయి. మీలాంటి ప్రతిభావంతుల వల్లే భారత్ ప్రపంచ వేదికపై మరింత వెలుగొందుతోంది” అని ఆమె పేర్కొన్నారు. వైభవ్‌తో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మరో 19 మంది చిన్నారులు కూడా ఈ బాల పురస్కారాన్ని అందుకున్నారు.

కాగా, ఈ సీజన్‌లో వైభవ్ విజయ్ హజారే ట్రోఫీలో ఇక ఆడే అవకాశం లేదని సమాచారం. జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న అండర్-19 ప్రపంచకప్‌కు సిద్ధమయ్యేందుకు అతను త్వరలోనే భారత అండర్-19 జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వైభవ్ ప్రయాణం ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -