Nayanthara: ‘కేజీఎఫ్ 2’తో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash), ఇప్పుడు మరింత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’(Toxic movie) ఇప్పటికే భారీ అంచనాల మధ్య ఉంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఈరోజు స్టార్ హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రంలో నయనతార ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆమె పాత్ర తీవ్రతను, కథలోని డార్క్ టోన్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. భారీ క్యాసినో నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్‌లో చేతిలో గన్ పట్టుకుని, పదునైన చూపులతో నయనతార అత్యంత స్టైలిష్‌గా, అంతే ప్రమాదకరంగా దర్శనమిస్తున్నారు. ఆమె లుక్ చూస్తేనే సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకంగా ఉండబోతోందో అర్థమవుతోంది.
ఈ సందర్భంగా దర్శకురాలు గీతు మోహన్ దాస్ నయనతార పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నయనతార స్టార్‌డమ్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ‘టాక్సిక్’లో ఆమెను ప్రేక్షకులు పూర్తిగా కొత్త కోణంలో చూస్తారు. షూటింగ్ కొనసాగుతున్న కొద్దీ గంగ పాత్ర ఆత్మకు, నయనతార వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని నాకు అనిపించింది” అని ఆమె తెలిపారు. ఈ మాటలతో నయనతార పాత్రపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.
ఈ చిత్రంలో ఇప్పటికే కియారా అద్వానీ ‘నాడియా’ గా, హుమా ఖురేషి ‘ఎలిజబెత్’ గా నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. యశ్, వెంకట్ కే నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నేషనల్ అవార్డ్ విన్నర్ రాజీవ్ రవి నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు ‘జాన్ విక్’ ఫేమ్ జేజే పెర్రీతో పాటు అన్బరివ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఉగాది, ఈద్ పండుగలను పురస్కరించుకుని 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘టాక్సిక్’ యశ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా అనే ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Introducing Nayanthara as GANGA in – A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie
@advani_kiara @humasqureshi #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #SandeepSharma #JJPerry… pic.twitter.com/FSiWGo7XeC
— Yash (@TheNameIsYash) December 31, 2025
