end
=
Saturday, January 10, 2026
వార్తలురాష్ట్రీయంకేసీఆర్‌ను కలవనున్న సీతక్క, కొండా సురేఖ
- Advertisment -

కేసీఆర్‌ను కలవనున్న సీతక్క, కొండా సురేఖ

- Advertisment -
- Advertisment -

KCR: తెలంగాణ రాజకీయ వేదికపై ఈరోజు ఓ కీలకమైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును(KCR) మంత్రులు సీతక్క, కొండా సురేఖ(Seethakka, Konda Surekha) కలవబోతున్నారు. ఈ భేటీ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కేసీఆర్‌ను అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రులు ఆయనకు అందజేయనున్నారు. మరోవైపు, మేడారం మహా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి.

‘తెలంగాణ కుంభమేళా’గా ప్రసిద్ధిగాంచిన ఈ జాతర జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 28న సారలమ్మ అమ్మవారు, 29న సమ్మక్క అమ్మవారు గద్దెపైకి విచ్చేయనున్నారు. 30న లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోనుండగా, 31న వనప్రవేశంతో జాతర ముగియనుంది. ఈ మహా జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ పండుగను రాజకీయాలకు అతీతంగా, ప్రజలందరి పండుగగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందిస్తున్నారు.

ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష నేతను గౌరవిస్తూ జాతర వేడుకలకు ఆహ్వానించడం రాజకీయాల్లో సానుకూల సంకేతంగా చర్చకు దారి తీస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపడుతోంది. అమ్మవారి గద్దెలు, పరిసర ప్రాంగణం పునరుద్ధరణ పనులకు సంబంధించిన ప్రారంభోత్సవం జనవరి 19న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మేడారం జాతర ఆహ్వానం చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -