end
=
Thursday, November 6, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక మలుపు..కులగణన సర్వే వివరాలు బహిర్గతం అవనున్నాయా?
- Advertisment -

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక మలుపు..కులగణన సర్వే వివరాలు బహిర్గతం అవనున్నాయా?

- Advertisment -
- Advertisment -

BC Reservations : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari)చేసిన సంచలన వ్యాఖ్యలతో ఈ అంశం పునరాలోచనకు దారితీస్తోంది. ఇప్పటివరకు బహిర్గతం చేయని కులగణన సర్వే (Caste Census) వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో బయటపెట్టే అవకాశం ఉందని సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణన సర్వే వివరాలపై గత కొంతకాలంగా ప్రతిపక్షాలు బహిరంగంగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఈ సర్వే పూర్తి వివరాలను బయటపెట్టడం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్న కారణంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం బయటపెట్టలేదు. కేవలం సారాంశమే పంచుతూ, పూర్తి డేటా గోప్యంగా ఉంచింది. ఇదిలా ఉండగా, మంత్రి వాకిటి శ్రీహరి బీసీ బంద్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్, ఎంపిరికల్ డేటా” అన్నీ త్వరలోనే బహిర్గతం చేస్తామని తెలిపారు. కొన్ని పరిమితులు ఉండడంతో ఇప్పటివరకు ఈ వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేకపోయామని, కానీ ఇప్పటికే కోర్టుల్లో సమర్పించిన డేటాతోనే అనవసరమైన అడ్డంకులు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన, “మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు” అంటూ తేల్చి చెప్పారు.

ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన శ్రీహరి కులగణన సర్వే ద్వారా రాష్ట్రంలో బీసీల లెక్కలు తేలాయి. కాంగ్రెస్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉంది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ల విషయంలో నిష్టగా ఉన్నారు అన్నారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వదంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల విషయంలో ఎలా కోర్టులకి వెళ్లారో, కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల విషయంలో అలా చేయదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణకు తాము హాజరైన ఘట్టాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి సంఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదు అన్నారు బీసీలకు న్యాయం జరిగే ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు అంటూ హైకోర్టులో రెండు రోజుల పాటు స్వయంగా ఉన్నానని చెప్పారు. కొండా సురేఖ ఇంటి ఘటనను బీసీ రిజర్వేషన్ల అంశానికి లింక్ చేయడం సరైనది కాదని తేల్చి చెప్పారు. ఇది వేరే విషయం. దీనిని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు అన్నారు. బీసీ రిజర్వేషన్లను లక్ష్యంగా చేసుకుని చలనం కలిగించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను ఖండించారు.

ఇక, మంత్రి శ్రీహరి వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే డేటా బహిర్గతానికి సన్నద్ధమవుతోందా? అనే చర్చ మొదలైంది. గతంలో అర్ధవంతంగా మాత్రమే డేటా విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మొత్తం వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తోందా? ఈ దిశగా జరిగే మార్పులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపును తేచే అవకాశం ఉంది. సమాజంలో సమానత, న్యాయం కోసం సాగుతున్న ఈ పోరాటంలో తదుపరి అడుగు ఏదోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -