- యుగేంద్రతోపాటు కుటుంబాన్ని అంతం చేస్తానని వార్నింగ్
- గుట్టల బేంగంపేట స్థల వివాదమే కారణం
కారు రివర్స్ గేర్ – మహిళ మృతి
ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్రకు బెదిరింపు కాల్స్ వచ్చాయని బంజారాహిల్స్ పోలీసులు ఆశ్రయించినట్లు తెలిసింది. గుట్టల బేగంపేటలో ఉన్న స్థలం విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి జగపతిబాబు సోదరుడైన యుగేంద్రను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్
అదేగాకుండా యుగేంద్రతోపాటు ఆయన కుటుంబాన్ని మొత్తం అంతం చేస్తామని హెచ్చరించినట్లు కూడా ఫిర్యాదులో రాసి ఇచ్చారు. దీని వెనుక బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. రాతపూర్వకంగా బంజారాహిల్స్ పోలీసులకు జగపతి బ్రదర్స్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.