end
=
Wednesday, October 29, 2025
వార్తలుఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసురాలి ఎంట్రీ..హీరోయిన్‌గా వెండితెరపై జాన్వి స్వరూప్ ఘట్టమనేని
- Advertisment -

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసురాలి ఎంట్రీ..హీరోయిన్‌గా వెండితెరపై జాన్వి స్వరూప్ ఘట్టమనేని

- Advertisment -
- Advertisment -

Jaanvi Swarup: తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబం (Ghattamaneni family) పేరు వినగానే గుర్తుకు వచ్చేది నటశేఖర కృష్ణ (Krishna). ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్‌స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన మహేశ్ బాబు ఇప్పుడు తన తరాన్ని కొనసాగించే మరో కొత్త ముఖాన్ని పరిచయం చేయబోతున్నారు. అదే ఘట్టమనేని కుటుంబానికి చెందిన మూడో తరం వారసురాలు జాన్వి స్వరూప్ ఘట్టమనేని. జాన్వి, నటీమణి మరియు నిర్మాత అయిన మంజుల ఘట్టమనేని, నటుడు సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనకోడలైన జాన్వి, ఇప్పుడు స్వయంగా హీరోయిన్‌గా వెండితెరపై అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. అభిమానులు, సినీప్రియులు ఆమె కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇటీవలి కాలంలో జాన్వి సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు టాప్, ఆకుపచ్చ ప్యాంట్‌లో జాన్వి కనువిందు చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొత్తగా, ఉత్సాహభరితంగా కనిపించిన ఆమె లుక్, నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో స్టార్ హీరోయిన్ రాబోతోందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజానికి, జాన్వి నటనలో కొత్త కాదు. 2018లో ఆమె తల్లి మంజుల దర్శకత్వం వహించిన “మనసుకు నచ్చింది” సినిమాలో జాన్వి చిన్న పాత్రలో కనిపించారు. అప్పటికే ఆమె నటనలో ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పూర్తిస్థాయి కథానాయికగా తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం జాన్వి ప్రధాన పాత్రలో నటించబోయే తొలి సినిమా వివరాలు మాత్రం అధికారికంగా వెలువడలేదు. కథ, దర్శకుడు, హీరో వంటి వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరోయిన్‌గా జాన్విపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. తాత కృష్ణ గారి నటనా వారసత్వం, మామయ్య మహేశ్ బాబు స్థాయి, తల్లి మంజుల సృజనాత్మకత ఈ మూడింటి మిశ్రమంగా జాన్వి సినీప్రస్థానం ప్రారంభం కానుంది. తన కుటుంబం లాగా నటనలో ముద్రవేసే నటి అవుతుందా అన్న ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్ అంతటా నెలకొంది. త్వరలోనే ఈ కొత్త స్టార్ కిడ్స్ అరంగేట్ర చిత్రం వివరాలు వెలువడనుండగా, సినీప్రియులు ఆ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -