end
=
Thursday, May 16, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంFruit Juice:ఈ జ్యూస్‌లు తాగితే చెడు కొలెస్ట్రాల్ కనుమరుగే..
- Advertisment -

Fruit Juice:ఈ జ్యూస్‌లు తాగితే చెడు కొలెస్ట్రాల్ కనుమరుగే..

- Advertisment -
- Advertisment -

చెడు కొలెస్ట్రాల్‌ (bad cholesterol)ను ఎల్‌డిఎల్‌ (LDL)అంటారు. రక్తంలో (Blood) చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగితే ఆరోగ్య సమస్యలు (Health problems) వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్‌ (Blockage)ఏర్పడి గుండె (heart)జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. గుండెపోటు, హైపర్‌టెన్షన్‌‌, డయాబెటిస్‌, స్టోక్‌ (Heart attack, hypertension, diabetes, stroke)వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే కొన్ని డైటరీ సప్లిమెంట్ (Dietary supplement) ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చని అధ్యయనాలు(studies) చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రతి రోజూ ఒక గ్లాసు జ్యూస్ ను  (juice)తాగితే శరీరంలో (body)పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఏ జ్యూసులు తాగాలో ఇపుడు  చూద్దాం..

ఆరెంజ్ జ్యూస్ (Orange juice)

సిట్రస్ ఫ్రూట్ (Citrus fruit)అయిన ఆరెంజ్ లో విటమిన్ సి (Vitamin C)పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ ను తాగినవారిలో ఈ పరిశోధన ముగిసే సమయానికి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ 18 శాతం తగ్గినట్టు తేలింది. నారింజ రసం లో ఎక్కువ మొత్తంలో ఫ్లేవనాయిడ్లు (Flavonoids) ఉంటాయి అని తేలింది.ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ (Fiber content) మలబద్ధకం (Constipation)సమస్యను పోగొట్టడంలో ఎఫెక్టివ్ (Effective)గా పనిచేస్తుంది. ఈ ఫైబర్ కంటెంట్ పేగులను క్లీన్ గా ఉంచుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నారింజ పండ్లు తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.

(Guava: జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం జామాకులు)

చెర్రీ (Cherry)

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చెర్రీ జ్యూస్ కూడా ఎంతో సహాయపడుతుంది. చెర్రీ జ్యూస్ కొలెస్ట్రాల్ ని తగ్గించడం కాదు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.  క్రమం తప్పకుండా చెర్రీ జ్యూస్ ను తాగడం వల్ల రక్తపోటు (blood pressure) నియంత్రణలో ఉంటుంది. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నిద్రలేమితో  (insomnia) బాధపడుతున్న వారు కూడా పడుకునే ముందు ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి నిద్రను పొందవచ్చు.

టొమాటో (Tomato)

టమోటా ఆరోగ్యానికి  చాలా రకాల మేలు చేస్తాయి.  ఇందులో కాల్షియం, విటమిన్,  భాస్వరం (Calcium, vitamin, phosphorus) వంటి పోషకా (Nutrients)లుంటాయి. ఇది శరీరాన్ని దృఢంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో లైకోపీన్ (Lycopene)పిలువబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant)ఉంటుంది. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. అంతేకాకుండా  టమాటా జ్యూస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే బీటా-కెరోటిన్, లైకోపీన్, విటమిన్-ఇ, (Beta-carotene, lycopene, vitamin-E) మొదలైనవి ఇందులో  ఉంటాయి. ఇవీ మీ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) ఉండే ఆహారాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అంతేకాదు గుండె జబ్బులు, క్యాన్సర్, వృద్ధాప్యం, అల్జీమర్స్ వ్యాధి, స్ట్రోక్, (Cancer, aging, Alzheimer’s disease, stroke) ఇతర వ్యాధులను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మ్యాంగో (mango): వేసవిలో (summer)దొరికే అమృత ఫలం మామిడి. దీని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే అందులో ఉండే గింజల వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మామిడి గింజలతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవచ్చు. దీంతో పాటు కడుపుకు సంబంధించిన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

(Health:చెట్లెక్కితే మానసిక ఆరోగ్యానికి మేలు..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -