NBK111: అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ప్రధాన పాత్రలో, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని(Director Gopichand Malineni) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ‘వీరసింహారెడ్డి’ విజయవంతమైన కాంబినేషన్ తర్వాత వస్తోన్న ఈ రెండో చిత్రం ప్రస్తుతం #NBK111 పేరుతో ప్రచారంలో ఉంది. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రానికి శుభారంభం చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. హిస్టారికల్ నేపథ్యంతో తెరకెక్కబోయే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీమ్ విడుదల చేసిన పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోస్టర్‌లో బాలయ్య రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తున్నారు. ఒక లుక్‌లో వీరోచిత యోధుడిలా, కవచ కుండలాలతో మహారథి రూపంలో కనిపిస్తుండగా, మరో లుక్‌లో మెడనిండా రుద్రాక్షమాలతో, తీవ్రమైన పవర్‌ను ప్రసరించే వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కోటల నేపథ్యంతో విడుదలైన ఈ పోస్టర్ చూసి, గోపీచంద్ మలినేని ఈసారి బాలకృష్ణకు పూర్తి స్థాయి పౌరాణిక, చారిత్రక యాక్షన్ డ్రామాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించినట్లుగా, ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార (Nayanthara)ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ జంటకు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి నటించిన ‘సింహా’, ‘జైసింహా’, ‘శ్రీ రామరాజ్యం’ సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో, ఈ నాల్గో సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
సంగీత విభాగాన్ని థమన్ చూసుకుంటున్నారు. బాలకృష్ణ, థమన్ కాంబినేషన్ గత కొన్నేళ్లుగా వరుస విజయాలను నమోదు చేస్తోంది. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాలకు థమన్ అందించిన సంగీతం అభిమానులను బాగా అలరించింది. ఈ కాంబినేషన్‌పై ఉన్న Craze దృష్ట్యా, ఈ చిత్రంలోని పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా, త్వరలో ‘అఖండ 2’ కూడా ఈ ఇద్దరి కలయికలో రానుంది. మొత్తంగా, #NBK111 ప్రారంభంతో బాలయ్య అభిమానుల్లో నూతన ఉత్సాహం మొదలైంది. శక్తివంతమైన ద్విపాత్రాభినయం, భారీ సెట్‌లు, మాస్ డైరెక్టర్ టచ్, నయనతార, థమన్ కాంబినేషన్ వంటి అంశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. చిత్రం నుండి వచ్చే తదుపరి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Big day ❤️❤️
A new beginning… a new benchmark.This HISTORICAL ROAR, this vision…
is finally taking its first breath.As we begin today, my heart is full and my purpose is clear. Grateful to walk this path with God of Masses #NandamuriBalaKrishna garu 🤗🤗🙏🏻🙏🏻#NBK111… pic.twitter.com/hdXn9jUrTt
— Gopichandh Malineni (@megopichand) November 26, 2025
