- అంతిరెడ్డిగూడ సర్పంచ్ జిల్లెల వెంకట్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు ఇచ్చే దసరా కానుక బతుకమ్మ చీరలు అని అంతిరెడ్డిగూడ సర్పంచ్ జిల్లెల వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ప్రతి ఏడాది దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నందిగామ మండలం, నందిగామ గ్రామ పంచాయతీ అంతిరెడ్డిగూడ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు దసరా పండుగ ఎంత ప్రత్యేకమైందో చెప్పనక్కర్లేదు. దసరా పర్వదినాన్ని ప్రతి ఆడపడుచు పేద, ధనిక బేధం లేకుండా బతుకమ్మ చీరలు ధరించి సంతోషంగా జరుపుకోవాలనీ.. అది రాష్ట్ర సీఎం కేసీఆర్ కల అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఎన్‌కౌంటర్‌లో నలుగరు మావోయిస్టులు హతం
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, నందిగామ ఉప సర్పంచ్ మెక్కొండ కుమార్ గౌడ్, నందిగామ గ్రామ టిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ గడ్డల శ్రీశైలం, వార్డు సభ్యులు బాల్ రెడ్డి, వేదం, ఆనంద్, మెక్కొండ నారాయణ, రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.