end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంCurry leaf: 'కరివేపాకు'తో అందం, ఆరోగ్యం..!
- Advertisment -

Curry leaf: ‘కరివేపాకు’తో అందం, ఆరోగ్యం..!

- Advertisment -
- Advertisment -

Curry leaf: పురాతన కాలం నుంచి మన వంటకాల్లో ‘కరివేపాకు’ను ఎక్కువగా వాడుతున్నాం. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే చేదుగా ఉండటం వల్ల తింటానికి ఎక్కువగా ఎవరూ ఇష్టపడరు. చాలా మంది భోజనం చేసేటప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాం. అయితే దీన్ని తినడం వల్ల చాలా చాలా మంచి లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..!

(జుట్టు విపరీతంగా రాలిపోతోందా…?)

జీర్ణవ్యవస్థను(Digestion) మెరుగు పరచడంలో, డయేరియాను నివారించడంలో, కొలెస్ట్రాల్‌(cholesterol)ను తగ్గించడంలో కరివేపాకు చక్కగా పనిచేస్తుంది.కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు(Hair fall)రాలిపోకుండా చేస్తుంది. కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే క్రమంగా జుట్టు పెరుగుతుంది.ఇనుము, ఫోలిక్‌ యాసిడ్‌(Folic Acid) అధికంగా ఉండే ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒకదానితో కలిపి తీసుకోగలగాలి. ఇది రక్తహీనతను దూరంగా ఉంచుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు(Blood Glucose Levels) సక్రమంగా ఉండాలంటే కొన్ని రోజులు కరివేపాకును ఎక్కువగా తిని చూడండి. ఈ ఆకులో పీచు అధికంగా ఉండటంతో రక్తంలోని చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది. కరివేపాకులో ఐరన్, జింక్, కాపర్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్లోమ గ్రంథిని(Pancreases) ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఇన్సులిన్(Insulin) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా వారి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

(మెంతులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు)

శరీరంలో అధిక కొవ్వును తగ్గించే గుణం కరివేపాకులో ఉంది. బరువు(Weight Reduce) పెరగకుండా శరీరాన్ని నియంత్రిస్తుంది. ప్రతిరోజు భోజనానికి ముందు కొన్ని కరివేపాకు ఆకులు నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. దీంతో అధిక బరువు సమస్యల నుండి తప్పించుకోవచ్చు.కరివేపాకులో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మేలు చేసే కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ(Anti-inflammatory) గుణాలు కూడా వీటిలో ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు(Infections) రాకుండా ఉంటాయి. జ్వరం, శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.కాలిన గాయాలు, దురదలు, వాపులు, దెబ్బలు తదితర వాటిపై కరివేపాకు అమోఘంగా పనిచేస్తుంది. కొన్ని కరివేపాకులను తీసుకుని పేస్ట్‌లా చేసి వాటిపై రాసి కట్టు కట్టాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుముఖం పడతాయి. గాయాల వల్ల వచ్చే మచ్చలు కూడా కనపడకుండా చేస్తుంది.

కరివేపాకులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండడం వల్ల ఎలాంటి గాయం అయినా, చర్మ సమస్యలు(Skin problems) అయినా త్వరగా తగ్గుముఖం పడతాయి.జ్ఞాపశక్తి తక్కువగా ఉందని భావించేవారు, మతిమరుపు ఉన్నవారు కరివేపాకులను తింటుంటే ఆయా సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. కంటిచూపును మెరుగు పరచడంలో కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. కరివేపాకులో ఉన్న విటమిన్-ఎ కంటి సమస్యల(Eye problems)ను దూరంచేస్తుంది. కంటి చూపు పెరిగేలా చేస్తుంది. కళ్లలో శుక్లాలు(Cataracts) రాకుండా కాపాడుతుంది.కరివేపాకు జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. వికారం, వాంతులు వచ్చినట్లు ఉంటే కరివేపాకును ఆహారంలో తీసుకోవాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.నీటిలో కరివేపాకు ఆకులను మరిగించి ఆ రసానికి నిమ్మరసం, చక్కెర కలిపి ‘కరివేపాకు టీ’ని రోజూ వారం పాటు తాగాలి. ఇది శిరోజాల వృద్ధిని పెంచుతుంది. వెంట్రుకలకు కాంతిని ఇస్తుంది. మూత్రపిండాల సమస్యల వలన కలిగే సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటివారు రోజు కరివేపాకు తినటం వలన మూత్రపిండ సమస్యలు ఉపశమనం కలుగుతుంది.

(Knee Pains:మోకాళ్ల నొప్పుల తో బాదపడుతున్నారా)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -