1.తమలపాకు(Betel leaves)లో నొప్పిని నివారించే గుణం(Ache decrease power) ఉంది. తమలపాకును కచ్చా పచ్చాగా దంచి నుదుటి మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి(Headache) వెంటనే తగ్గుతుంది.
2.జీర్ణశక్తి(Digestive System)ని పెంచడంలో తమలపాకు సహాయపడుతుంది. తమలపాకును నమలడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
3.మలబద్ధకాన్ని తగ్గించడంలో తమలపాకు సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తమలపాకును నమిల తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. పొట్టలో పేరుకుపోయిన మలినాలను, విష పదార్థాలను తొలగించి ఆకలి పెరిగేలా చేస్తుది.
4.తమలపాకును నమిలి తినడం వల్ల నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. నోట్లో ఉండే క్రిములు, బ్యాక్టీరియా నశిస్తాయి.
5.తమలపాకు నమలడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. చిగుళ్లు, దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
6. తమలపాకుకు ఆవాల నూనె రాసి ఆకును వేడి చేసి దానిని ఛాతిపై వేసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
7.దగ్గు సమస్యతో బాధపడుతున్నప్పుడు తమలపాకును నమిలి తినడం వల్ల దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ఇవన్నీ చేసే ముందు ఆకు మొదలులో కాండాన్ని తీసేసి తినాలి. ఇలా మూడు వారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
మీ ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్ వెంకటేష్
93928 57411