end
=
Saturday, July 12, 2025
వార్తలురాష్ట్రీయంప్రభాకర్‌రావుకు షాక్
- Advertisment -

ప్రభాకర్‌రావుకు షాక్

- Advertisment -
- Advertisment -

ట్యాపింగ్ కేసులో ట్విస్ట్
సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న ‘సిట్’

రాష్ట్రంలో కొద్దినెలలుగా చర్చనీయాంశంగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone taping case)లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ (Ex SIB Chief) ప్రభాకర్‌రావు (Prabahakar Rao) విచారణకు సహకరించకపోవడంతో సిట్ అధికారులు (SIT authorities) సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లి కోర్టు పనులు చూస్తున్నట్లు తెలిసింది.

ప్రభాకర్‌రావును అరెస్ట్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే సిట్ ఈ నిర్ణయం తీసుకున్నది. సిట్ ఇకపై ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో వాటిలోని డేటా కీలకంగా మారనున్నది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు.

ల్యాప్‌టాప్, ఫోన్ ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌కి చేరాయి. నిపుణులు 2023 అక్టోబర్ నుంచి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావు.. పలువురు బీఆర్‌ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల వాంగ్మూలం ఆధారంగా సిట్ ప్రభాకర్‌రావును విచారిస్తున్నది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -