- టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ విమర్శ
మూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు !
ఐదు రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ర్టంలో తీవ్ర పంట నష్టం జరిగిందని, పంట నష్టం అంచనా గానీ, నష్ట పరిహారం చెల్లించేందుకు గానీ సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని బిజెపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఆదివారం డి.కె ఆరుణ మీడియా సమావేశంలో పాల్గొని రాష్ర్ట ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ఎందుకు సమర్పించలేదని ఆమె ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లను మార్చి అస్తవ్యస్తంగా, ముందుచూపు లేకుండా రీడిజైన్ చేశారని తెలిపారు. అండర్‌గ్రౌండ్ పంప్‌హౌస్ కాన్సెప్ట్ సరైంది కాదని, దాని వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు, సీనియర్ ఇంజినీర్లు తెలిపినప్పటికీ ప్రభుత్వం అండర్‌గ్రౌండ్ పంప్‌హౌస్ ప్లాన్‌ను అనుసరిస్తుందని విమర్శించారు. అయితే దీనికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపంచడానికి తాను కేంద్రానికి లేఖరాయనున్నట్లు వివరించారు.
బస్సులో మంటలు … తప్పిన ప్రమాదం
ఇదిలావుండగా హైదరాబాదులో భారీ వర్షాలకు ఎన్నో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుండి బయటకు రావడం లేదని ఆరోపించారు. నగర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై లేదా అని ఆమె ప్రశ్నించారు. కనీసం హైదరాబాద్ నగరం ఏరియల్ సర్వే కూడా చేయకుండా నామ మాత్రపు కంటితుడుపు చర్యలు చేపట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు.