end
=
Friday, August 1, 2025
రాజకీయంకులగణన ఇత‌ర రాష్ట్రాల‌కూ ఆద‌ర్శం
- Advertisment -

కులగణన ఇత‌ర రాష్ట్రాల‌కూ ఆద‌ర్శం

- Advertisment -
- Advertisment -

88 కోట్ల పేజీల్లో గ‌ణాంకాలు, డేటా
ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

తెలంగాణ‌లో చేపట్టిన కులగణన యావ‌త్ దేశానికి ఆద‌ర్శ‌మ‌ని, ఇత‌ర రాష్ట్రాలూ ఆద‌ర్శంగా తీసుకుని త‌మ వ‌ద్ద కుల‌గ‌ణ‌న చేప‌ట్ట‌వ‌చ్చ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సర్వే మొత్తం 88 కోట్ల పేజీల డేటా అని పేర్కొన్నారు. స‌ర్వే దేశానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుందని అభివ‌ర్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన‌ హామీ మేరకే కుల‌గ‌ణ‌న నిర్వహించామన్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీలు, నేతల సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి కులగణన సర్వేపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర‌నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…‘‘2024లో తెలంగాణలో కులగణన సర్వే ప్రారంభించాం. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను ఆవరణలోకి తెచ్చే సమగ్ర సర్వే. మొత్తం 88 కోట్ల పేజీల్లో ఈ డేటా నిక్షిప్తమైంది. బీసీలపై ప్రధాని మోదీకి నిష్కపట ప్రేమ లేదని స్పష్టమవుతోంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలు రద్దు కావడంలో రాహుల్‌గాంధీ పోరాటం కీలకమైనదే. ఇప్పుడు కులగణన విషయంలోనూ కేంద్రం వెనక్కి తగ్గేలా చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘రాహుల్‌గాంధీ హామీ మేరకే తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేపట్టాం. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా గుర్తించి వివరాలు సేకరించాం. ఇది దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుంది’’ అని తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -