end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Kids Health:పేరెంట్స్ చేతుల్లోనే పిల్లల మానసిక ఆరోగ్యం
- Advertisment -

Kids Health:పేరెంట్స్ చేతుల్లోనే పిల్లల మానసిక ఆరోగ్యం

- Advertisment -
- Advertisment -

  • చిల్ట్రన్‌లో సరిగ్గా గుర్తించబడని మెంటల్ ఇల్‌నెస్
  • పిల్లల భావాలకు పేరెంట్స్ ప్రాధాన్యతనివ్వాలి
  • సంభాషణకు కంఫర్టబుల్ ప్లేస్ కల్పించాలి
  • ధ్యానం, యోగా స్కిల్స్‌తో మైండ్‌ఫుల్‌నెస్


బాలల హక్కులు (Child Rights), విద్య (Education), సంక్షేమం (Welfare)పై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏట నవంబర్ 14న భారతదేశం బాలల దినోత్సవాన్ని (Children’s Day) జరుపుకుంటోంది. ఇక నేటి ప్రధాన ప్రాధాన్యతల్లో మానసిక ఆరోగ్యం (mental health) కూడా ఒకటి. కానీ ఇండియాలో ఇలాంటి సమస్యలున్న పిల్లలు తరచుగా గుర్తించబడరు. సాయం లేదా చికిత్స తీసుకునేందుకు ఇష్టపడరు. 2019లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ (Indian Journal of Psychiatry) ప్రకారం.. పాండమిక్‌కు ముందు కూడా కనీసం 50 మిలియన్ భారతీయ పిల్లలు మెంటల్ హెల్త్ ఇష్యూస్‌ (Mental health issues)తో బాధపడ్డారు. అయితే వీరిలో దాదాపు 80-90% మంది సాయం కోరలేదు. కాబట్టి పేరెంట్స్ తమ పిల్లల మానసిక స్థితిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముండగా.. సంబంధిత చిట్కాలు మీ కోసం!

భావాలను గుర్తించాలి :
పిల్లలకు ఎలా అనుభూతి చెందాలో చెప్పేందుకు బదులు.. వారికి లేదా వారి చుట్టుపక్కల ఏం జరుగుతుందో సొంత ఆలోచనలు, భావోద్వేగాల్లో వ్యక్తపరిచేలా ప్రోత్సహించాలి (encouraged). విచారకరమైన రోజులు గడపడం సరైందేనని పిల్లలకు గుర్తు చేయండి. అదే అంశం గురించి కంఫర్టబుల్‌ (Comfortable)గా మాట్లాడటంలో, భావాలను పదాల్లో వ్యక్తీకరించడంలో వారికి సాయపడాలి.

సురక్షిత స్థలాన్ని కల్పించాలి : (safe place should be provided)
మీ ఇంటిని మీ బిడ్డ స్వాగతించే, ఇష్టపడే ప్రదేశంగా మార్చాలి. ఎందుకంటే పిల్లలు తమ తల్లిదండ్రులతో (Parents) సంభాషించడానికి సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఇది పిల్లల భావోద్వేగ స్థిరత్వ అభివృద్ధికి తోడ్పడుతుంది.

(Head Bath:తలస్నానంతో మహిళలకు ప్రమాదమే!)

అప్పుడప్పుడు విరామం ఇవ్వాలి : (Give a break)
చాలా సార్లు స్కూల్ (school), స్టడీస్ (studies), ఎగ్జామ్స్ (Exams)పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల, వారికి విరామం ఇవ్వడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలు ఒత్తిడికి (Stress)లోనవుతున్నప్పుడు, బ్రేక్ (Break)ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఆ సమయంలో వారికి ఆసక్తి కలిగించే, ఆనందించే కార్యకలాపాలపై దృష్టిపెట్టేలా ప్రోత్సహించాలి. ఈ విధంగా పిల్లల ప్రతిభా సామర్థ్యాలు పెంపుదలకు కృషి చేయాలి.

డిజిటల్ డిటాక్స్: Digital detox
ప్రస్తుత కాలంలో పిల్లల శ్రేయస్సు, మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా భారీ ప్రభావాన్ని చూపుతోంది. కాబట్టి చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా యొక్క లాభాలు, నష్టాల గురించి పిల్లలతో సంభాషించాలి. వారానికి కనీసం రెండు రోజులు మీ పిల్లలతో డిజిటల్ డిటాక్స్‌ను ప్రయత్నించండి.

ధ్యానం, యోగా (Meditation and yoga)
మీ పిల్లలకు ధ్యానం(Meditation), యోగా (yoga), వ్యాయామం (Exercise), జర్నలింగ్ మొదలైన సాధారణ కోపింగ్ నైపుణ్యాలను తప్పకుండా నేర్పించాలి. అలాగే సానుకూలతపై దృష్టిపెడుతూ వారికి కృతజ్ఞత గురించి కూడా బోధించాలి. ఇలా ధ్యానం, యోగాతో పిల్లలు మైండ్‌ఫుల్‌నెస్ (Mindfulness) ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.

(Beer:‘బీర్‌’తో అల్జీమర్స్ వ్యాధి మాయం)

చురుగ్గా వినడం : (listen clear)
ఒక సంఘటన లేదా వ్యక్తికి సంబంధించి పిల్లలు తమ భావాలు/ఆశల గురించి మీకు చెప్పే విషయాలపై శ్రద్ధ వహించాలి. వారు ఎందుకు అలా భావిస్తున్నారో, ఎక్కడ నుంచి వస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఇలా మీతో పంచుకున్న సమాచారం (Information) పట్ల పిల్లలను విశ్వసించాలి. ఇక వాళ్లు ఎదుర్కొంటున్న కష్టం ఎంత చిన్నదిగా అనిపించినా అంగీకరించాలి. ఎందుకంటే పిల్లల దృష్టిలో ఆ సమస్య పెద్దదే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -