సిగాచీ అగ్ని ప్రమాదం(Sigachi Fire Accident)పై ప్రభుత్వం (TG Government) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని(Neglecting Factor) మాజీ మంత్రి (Ex Minister) హరీశ్‌రావు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేదని ఆయన అన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్‌ను కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… “సిగాచీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు కేవలం రూ.లక్ష మాత్రమే ఇచ్చారు. మిగిలినవారు ఎంతమంది? ఎవరికి ఎంత ఇచ్చారు? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. బాధిత కుటుంబాలు అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పరిహారం విషయంలో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని, ఎన్ని కుటుంబాలకు ఎంత ఇచ్చారో అధికారికంగా వెల్లడించాలని” హరీశ్‌రావు డిమాండ్ చేశారు.